logo

వృద్ధురాలికి పింఛను పునరుద్ధరణ

లోదొడ్డి గ్రామానికి చెందిన మాతే బంగారమ్మ భర్త ఎనిమిదేళ్ల క్రితం చనిపోయారు. అతడు బతికున్నాడనే కారణం చూపి బంగారమ్మ పింఛను జనవరి నుంచి నిలిపివేశారు.

Published : 03 Feb 2023 04:23 IST

బంగారమ్మకు పింఛను సొమ్మును అందజేస్తున్న సర్పంచి రామారావు

రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: లోదొడ్డి గ్రామానికి చెందిన మాతే బంగారమ్మ భర్త ఎనిమిదేళ్ల క్రితం చనిపోయారు. అతడు బతికున్నాడనే కారణం చూపి బంగారమ్మ పింఛను జనవరి నుంచి నిలిపివేశారు. ఈ సమస్యపై జనవరి 2న ‘పింఛన్ల తొలగింపు సరికాదు’ శీర్షికన ఈనాడు, ఈటీవీలో కథనాలు వచ్చాయి. దీనికి ఎంపీడీవో కె.బాపన్నదొర, ఇతర ఉన్నతాధికారులు స్పందించారు. బంగారమ్మకు పింఛను పునరుద్ధరించారు. సర్పంచి రామారావు చేతులమీదుగా గురువారం ఈమెకు ఫిబ్రవరి నెల పింఛను సొమ్ము అందజేశారు. లోదొడ్డి సర్పంచి, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోతా రామారావు, ఉప సర్పంచి బి.రాజుబాబు, వార్డు సభ్యుడు జె.రాజుబాబు, డీఏ వై.కృష్ణారెడ్డి, గ్రామ పోలీస్‌ వై.లోవకుమారి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని