logo

ఉపాధి పనుల కల్పనలో నిర్లక్ష్యం తగదు

జాబ్‌కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి 100 రోజుల పనిదినాలు కల్పించాలని ఉపాధిహామీ ఉప కమిషనర్‌ డి.మల్లికార్జునరావు ఆదేశించారు.

Published : 04 Feb 2023 02:46 IST

అధికారులతో సమీక్షిస్తున్న మల్లికార్జునరావు, వేదికపై డ్వామా పీడీ రమేష్‌ రామన్‌, ఉపాధి హామీ అధికారులు

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: జాబ్‌కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి 100 రోజుల పనిదినాలు కల్పించాలని ఉపాధిహామీ ఉప కమిషనర్‌ డి.మల్లికార్జునరావు ఆదేశించారు. శుక్రవారం అరకులోయ, పాడేరు మండలాల్లో పర్యటించి ఉపాధిహామీ పనులు పరిశీలించారు. అనంతరం స్థానిక కాఫీ హౌస్‌లో ఎంపీడీఓలు, ఉపాధిహామీ ఏపీడీలు, ఇంజినీరింగ్‌ సహాయకులు, క్షేత్రస్థాయి సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ముందుగా పనులు గుర్తించాలన్నారు. ఉపాధి హామీ పనుల కల్పనలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అటవీ హక్కు పత్రాలు పొందిన లబ్ధిదారులకు 150 రోజుల పనిదినాలు కల్పించాలని చెప్పారు. వేతనదారుకు రోజుకు రూ. 257 కూలి అందే విధంగా పనులు చేయించాలని ఆదేశించారు. డ్వామా పీడీ రమేష్‌రామన్‌, ఏపీడీలు గిరిబాబు, రామారావు, పాడేరు ఎంపీడీఓ సాయినవీన్‌, డీబీటీ మేనేజర్‌ నరేంద్రకుమార్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని