logo

‘కల్తీ సరకులతో మోసపోతున్న గిరిజనులు’

మన్యంలోని వారపు సంతల్లో నాసిరకం సరకులను విక్రయించి వ్యాపారులు గిరిజనులను తీవ్రంగా మోసగిస్తున్నారని సీపీఎం నాయకులు అన్నారు.

Published : 05 Feb 2023 03:08 IST

తహసీల్దారుకు వినతిపత్రం అందిస్తున్న సీపీఎం నాయకులు

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: మన్యంలోని వారపు సంతల్లో నాసిరకం సరకులను విక్రయించి వ్యాపారులు గిరిజనులను తీవ్రంగా మోసగిస్తున్నారని సీపీఎం నాయకులు అన్నారు. నాసిరకం సరకుల విక్రయాలను అరికట్టాలని కోరారు. ఈ మేరకు శనివారం మారేడుమిల్లి మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం తహసీల్దారు టి.శ్రీనివాసరావుకు వినతిపత్రం అందించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు మట్ల వాణిశ్రీ మాట్లాడుతూ కల్తీ సరకుల విక్రయాలపై కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. సీపీఎం నాయకులు ఈతపల్లి సిరిమల్లిరెడ్డి, ఈతపల్లి సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పరిహారం అందించాలి

రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: లోదొడ్డిలో గతేడాది ఫిబ్రవరి 2న జీలుగుకల్లు తాగి మృతి చెందిన అయిదుగురు గిరిజనుల కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు లోతా రామారావు కోరారు. ఈ మేరకు శనివారం ఉప తహసీల్దార్‌ సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. సీపీఎం నాయకులు కె.సూరిబాబు, కె.జగన్నాథం, ఎం.రమేష్‌, జె.రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని