logo

అవస్థలకు ఎనిమిదేళ్లు

అంగన్‌వాడీ భవన నిర్మాణ పనులు ప్రారంభించి ఎనిమిదేళ్లవుతున్నా నేటికీ పూర్తికాలేదు. ఈ అసంపూర్తి భవనంలోనే కేంద్రాన్ని కొనసాగిస్తున్నారు.

Published : 06 Feb 2023 02:58 IST

పూర్తవని అంగన్‌వాడీ కేంద్రం

కొయ్యూరు, న్యూస్‌టుడే: అంగన్‌వాడీ భవన నిర్మాణ పనులు ప్రారంభించి ఎనిమిదేళ్లవుతున్నా నేటికీ పూర్తికాలేదు. ఈ అసంపూర్తి భవనంలోనే కేంద్రాన్ని కొనసాగిస్తున్నారు. దీని పక్కనే ఉన్న భవనం శిథిలమై కూలిపోతుండటంతో చిన్నారుల, తల్లిదండ్రులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. కొమ్మిక పంచాయతీ బొర్రంపేటలోని అంగన్‌వాడీ కేంద్రం శిథిలమైంది. నూతన భవన నిర్మాణానికి 2015లో రూ. ఆరు లక్షల నిధులను అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ తర్వాత పనులు ప్రారంభమైనా నత్తనడకన సాగాయి. గతేడాది ప్లాస్టింగ్‌ పనులు ప్రారంభించారు. ఓ గదిలో ప్లాస్టింగ్‌, కింద గచ్చు చేయడం మానేశారు. లోపల ప్లాస్టింగ్‌ చేయడానికి వేసిన పరంజా అలానే వదిలేశారు.

పక్కనే కూలిపోతున్న పాత భవనం

* గత కొన్నేళ్లుగా పరాయి పంచన కొనసాగిన అంగన్‌వాడీ కేంద్రాన్ని.. ఈ అసంపూర్తి భవనంలోకి మార్చారు. దీని పక్కనే ఉన్న పాత భవనం కూలిపోతోంది. గోడ మధ్యలో పెద్ద రంధ్రం ఏర్పడింది. రాతిగోడ కూలిపోతోంది. ఈ భవనం ఎప్పుడు కూలిపోతుందోనని అంగన్‌వాడీ కార్యకర్త, చిన్నారులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పిల్లలు బయటకు వచ్చే సమయంలో కార్యకర్త, ఆయా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఇప్పటికైనా ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి స్పందించి అసంపూర్తి భవన నిర్మాణం పూర్తి చేయించడంతోపాటు శిథిలమైన భవనాన్ని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు