logo

తెదేపాతోనే నిర్వాసితులకు న్యాయం

తెదేపా హయాంలోనే పోలవరం నిర్వాసితులకు న్యాయం జరిగిందని మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అన్నారు. ప్రస్తుతం నిర్వాసితులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదని చెప్పారు.

Published : 06 Feb 2023 02:58 IST

సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి

దేవీపట్నం, న్యూస్‌టుడే: తెదేపా హయాంలోనే పోలవరం నిర్వాసితులకు న్యాయం జరిగిందని మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అన్నారు. ప్రస్తుతం నిర్వాసితులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదని చెప్పారు. దేవీపట్నం మండలం పి.గొందూరు ఆర్‌అండ్‌ఆర్‌ పునరావాస కాలనీలో పార్టీ మండలాధ్యక్షులు మరిశెట్ల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆదివారం ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పార్టీ నియోజకవర్గ పరిశీలకులు యర్రా వేణుగోపాల నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాసితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారు మాట్లాడుతూ విద్యుత్తు ఛార్జీలు, భూముల పేరుతో పింఛన్లు తొలగిస్తున్నారన్నారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.పది లక్షల, వరదల పరిహారం పూర్తిస్థాయిలో అందలేదని చెప్పారు. పరిశీలకులు వేణుగోపాలనాయుడు, మాజీ ఎమ్మెల్యే రాజేశ్వరి మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వంలో అన్నిరకాల ధరలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెదేపాను గెలిపిస్తేనే ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు. కాలనీలో 30 కుటుంబాలు తెదేపాలో చేరాయి. నాయకులు సంగం శ్రీకాంత్‌, మట్టా మెహర్‌బాబాగౌడ్‌, సింగరాజు, మాగాపు బాబూరావు, దాకారపు సత్యనారాయణ, ముచ్చు నాగేశ్వరరావు, గోళ్ల చంటిబాబు, కొత్తపల్లి అన్నారం, అచ్చిబాబు, బుజ్జిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని