logo

అభివృద్ధి చేస్తే అద్భుతాలే!

ఎత్తయిన బండ రాళ్ల పైనుంచి జాలువారుతూ ప్రకృతి ప్రేమికులను కట్టి పడేస్తున్న జలపాతాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు.

Updated : 06 Feb 2023 06:00 IST

జి.మాడుగుల, న్యూస్‌టుడే

గుర్రాయిలో.., కంఠవరంలోని అక్కాచెల్లెమ్మ జలపాతం

ఎత్తయిన బండ రాళ్ల పైనుంచి జాలువారుతూ ప్రకృతి ప్రేమికులను కట్టి పడేస్తున్న జలపాతాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఈ ప్రకృతి రమణీయమైన ప్రాంతాలు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్నాయి. మండలంలోని కొత్తపల్లి జలపాతం ఇప్పటికే విశేషంగా ప్రాచుర్యం పొందింది. దీంతోపాటు మండలంలో మరో రెండు ముచ్చటగొలిపే జలపాతాలున్నాయి. వీటి అభివృద్ధికి అధికారులు చొరవ చూపించాల్సి ఉంది.

* సొలభం పంచాయతీ ఎగువ కంఠవరం గ్రామ సమీపంలో అక్కాచెల్లెమ్మ జలపాతం ఉంది. ఇది పెద్దపెద్ద బండరాళ్ల మధ్య నుంచి జాలువారుతూ ప్రకృతి ప్రేమికులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఇక్కడ గతంలో పలు సినిమాలు, సీరియల్స్‌లోని పలు సన్నివేశాలు, పాటలను చిత్రీకరించారు. హీరో సంతోష్‌ శోభన్‌ నటించిన ‘లైక్‌ షేర్‌, సబ్‌స్క్రైబ్‌, హీరో ప్రిన్స్‌, హీరోయిన్‌ నందిత నటించిన ‘నీకు నాకు డాష్‌ డాష్‌’ సినిమాల్లోని పలు పాటలు, సన్నివేశాలను ఈ పరిసరాల్లో చిత్రీకరించారు. ఈ జలపాతానికి వెళ్లేందుకు జి.మాడుగుల నుంచి ఎగువ కంఠవరం వరకు తారురోడ్డు సదుపాయం ఉంది. అక్కడ నుంచి అర కిలోమీటరు నడవాలి. గుర్రాయి జలపాతం కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ జలపాతం మొత్తం బండరాయిపై పరుపులా పరచుకున్నట్లు ఉంటుంది.

ఎగువ కంఠవరంలో చిత్రీకరించిన నీకు నాకు డాష్‌ డాష్‌ చిత్రంలో సన్నివేశం

స్థానికులకు ఉపాధి

కొత్తపల్లి జలపాతం వద్ద గతంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో వనబంధు కళ్యాణ యోజన ద్వారా రూ. కోటి కేటాయించి మెట్లు, మరుగుదొడ్లు, విద్యుత్తు, సీసీ రోడ్లు, సీసీ కెమెరాలు వంటి సదుపాయాలు కల్పించారు. ప్రస్తుతం ఇక్కడకు భారీగా పర్యటకులు తరలివస్తున్నారు. దీన్ని ఎకో టూరిజంగా ఐటీడీఏ అభివృద్ధి చేసింది. సుమారు 20 మంది స్థానిక యువత ఉపాధి పొందుతున్నారు. ఎగువ కంఠవరంలోని అక్కాచెల్లెమ్మ, గుర్రాయి జలపాతాలను అభివృద్ధి చేస్తే పర్యటకంగా మంచి గుర్తింపు వస్తుందని, తమకూ ఉపాధి దొరుకుతుందని స్థానికులు కోరుతున్నాం.

పీవో దృష్టికి తీసుకెళ్తాం

కంఠవరంలో అక్కాచెల్లమ్మ, గుర్రాయి జలపాతాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడతాం. ఈ అంశాన్ని ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ దృష్టికి తీసుకెళ్తాం. స్థానికులకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తాం.

లోహిత్‌ జయసాగర్‌, ఎంపీడీవో, జి.మాడుగుల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని