జల విద్యుత్కేంద్రాల నిర్మాణానికి సహకరిస్తాం
లోయర్ మాచ్‌ఖండ్, బలిమెల వద్ద జల విద్యుత్కేంద్రాల నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామని ఒడిశా రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ సుశాంత్ నందా హామీ ఇచ్చారు.
ఒడిశా అటవీశాఖ ఉన్నతాధికారి సుశాంత్ నందా
విద్యుత్తు కేంద్రం వద్ద అధికారుల బృందం
ముంచంగిపుట్టు గ్రామీణం, న్యూస్‌టుడే: లోయర్ మాచ్‌ఖండ్, బలిమెల వద్ద జల విద్యుత్కేంద్రాల నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామని ఒడిశా రాష్ట్ర అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ సుశాంత్ నందా హామీ ఇచ్చారు. ఆంధ్ర-ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్‌ఖండ్ జలవిద్యుత్తు కేంద్రాన్ని సుశాంత్ నందా, ఒడిశా జలవిద్యుత్తు కార్పొరేషన్ డైరెక్టర్ ఆశిష్ కుమార్ మహంతి సోమవారం సందర్శించారు. తొలుత వించ్ మార్గంలో మాచ్‌ఖండ్ ప్రాజెక్టుకు చేరుకున్నారు. వించ్ ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ ప్రాజెక్టు విశేషాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యుత్తు కేంద్రానికి విద్యుదుత్పత్తి తీరు అడిగి తెలుసుకున్నారు. ‘న్యూస్‌టుడే’తో సుశాంత్ మాట్లాడుతూ అత్యంత పురాతన విద్యుత్కేంద్రాన్ని సందర్శించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. బలిమెల వద్ద ఆంధ్ర-ఒడిశా ఉమ్మడిగా నిర్మించే 60 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రం, లోయర్ మాచ్‌ఖండ్ వద్ద మినీ ప్రాజెక్టు నిర్మాణాలకు కావాల్సిన అటవీ అనుమతులకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. డుడుమ జలపాతం వద్ద పంచాయతీల ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ఆశిష్ కుమార్ మాట్లాడుతూ ఇప్పటికే మాచ్‌ఖండ్ ప్రాజెక్ట్ ఆధునికీకరణకు సంబంధించి ఒప్పందాలు పూర్తయ్యాయని, సర్వే చురుగ్గా సాగుతోందన్నారు. ఆధునికీకరణ పూర్తయితే మాచ్‌ఖండ్‌లో ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని చెప్పారు. జోలాపుట్ మినీ హైడల్, లోయర్ మాచ్‌ఖండ్, బలిమెల ప్రాజెక్టులకు అడ్డంకులు తొలగి పనులు త్వరలో ప్రారంభమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మాచ్‌ఖండ్ ఎస్‌ఈ కె.వి.నాగేశ్వరరావు, ఈఈలు బి.గోవిందరాజులు (జనరేషన్), ఆదిత్య సామంత్ రాయ్ (సివిల్), కొల్లబ్ కె.రమేశ్, ఏడీఈలు రాజ్‌కుమార్, అమరేంద్ర త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Anushka Sharma: పన్ను వివాదంలో లభించని ఊరట.. అనుష్క శర్మ పిటిషన్ కొట్టివేత
-
Sports News
Cricket: అత్యంత చెత్త బంతికి వికెట్.. క్రికెట్ చరిత్రలో తొలిసారేమో!
-
General News
Telangana News: రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదు
-
World News
Mobile: ‘ఫోన్ వాడకాన్ని చూసి విస్తుపోయా’.. సెల్‌ఫోన్ పితామహుడు
-
World News
USA: అమెరికాలో భారతీయ టెకీలకు గుడ్ న్యూస్
-
Crime News
Mumbai: ప్రియుడితో భార్య వెళ్లిపోయిందని.. మామను చంపిన అల్లుడు