logo

స్పందన ఫిర్యాదులను పరిష్కరించండి

స్పందనలో గిరిజనులు విన్నవించిన సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీవో సూరజ్‌గనోరే ఆదేశించారు.

Published : 07 Feb 2023 03:43 IST

సమస్యలు వింటున్న ఐటీడీఏ పీఓ సూరజ్‌ గనోరే, సబ్‌ కలెక్టర్‌ శుభం బన్సల్‌

రంపచోడవరం, న్యూస్‌టుడే: స్పందనలో గిరిజనులు విన్నవించిన సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీవో సూరజ్‌గనోరే ఆదేశించారు. సోమవారం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో సబ్‌ కలెక్టర్‌ శుభం బన్సల్‌, ఏపీవో శ్రీనివాసరావుతో కలసి ఆయన స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 70 మంది వివిధ సమస్యలపై వినతులు అందజేశారు. లోతట్టు గ్రామాలకు రహదారులు వేయాలని, తాగునీటి ట్యాంకులు ఏర్పాటు చేయాలని పలువురు విన్నవించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ముంపునకు గురవుతున్న తమకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ చెల్లించాలని పలువురు నిర్వాసితులు వినతిపత్రం అందజేశారు. ఇన్‌ఛార్జి ఏడీఎంహెచ్‌వో రాధిక, ప్రాంతీయ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కల్పన, విద్యుత్తు ఈఈ యూసఫ్‌, పీఆర్‌ డీఈ దుర్గాప్రసాద్‌, ఎంపీడీవో కుమార్‌బాబు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు