logo

ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరగాలి

ఆసుపత్రిలో సుఖ ప్రసవాలు అధిక సంఖ్యలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ జమాల్‌ బాషా పేర్కొన్నారు.

Published : 07 Feb 2023 03:43 IST

మినుములూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దస్త్రాలు పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో జమాల్‌ బాషా

పాడేరు, న్యూస్‌టుడే: ఆసుపత్రిలో సుఖ ప్రసవాలు అధిక సంఖ్యలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ జమాల్‌ బాషా పేర్కొన్నారు. స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో సోమవారం నూతనంగా నియమితులైన రెండో బ్యాచ్‌ ఎంఎల్‌హెచ్‌పీ(సీహెచ్‌ఓ)లకు శిక్షణ శిబిరాన్ని నిర్వహించారు. 11 మండలాల పరిధిలోని 36 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది హాజరయ్యారు. హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ కేంద్రాల్లో వైద్యం కోసం వచ్చే రోగులకు అందించే సేవలపై అవగాహన కల్పించారు. మాతాశిశు మరణాలపై వైద్యారోగ్యశాఖ తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. గర్భిణులను ప్రసవానికి ముందే బర్త్‌ వెయిటింగ్‌ హాల్‌లో చేర్పించాలని సూచించారు. తల్లిపాల ప్రాముఖ్యత, వ్యాక్సినేషన్‌, 14 రకాల వ్యాధుల నిర్ధారణ, కన్ను, ముక్కు, చెవి, ఇతర మానసిక వ్యాధులు, కాలినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. స్థానికంగా ఉంటూ మెరుగైన వైద్యసేవలు అందించాలని సూచించారు. వారం రోజులపాటు ఈ శిక్షణ కొనసాగుతుందని చెప్పారు. వైద్యాధికారులు సింధూరంపడాల్‌, విఘ్నేష్‌, జిల్లా గణాంకాధికారి కైలాష్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

* అనంతరం మినుములూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్‌వో ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్‌సీ పరిధిలో సుఖ ప్రసవాలపై ఆరా తీశారు. ఫ్యామిలీ ఫిజీషియన్‌ శిబిరాల్లో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని చెప్పారు. ప్రోగ్రాం అధికారి ముందస్తు అనుమతి లేకుండా సెలవులు తీసుకోరాదని చెప్పారు. వైద్యాధికారి డాక్టర్‌ గోపాలకృష్ణ, జిల్లా టీబీ పర్యవేక్షకులు కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని