logo

‘బటన్‌ నొక్కడం కాదు.. సదుపాయాలు కల్పించండి’

అభివృద్ధి అంటే బటన్‌ నొక్కడం కాదని, ప్రతి పల్లెలో మౌలిక వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి జగన్‌కు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సూచించారు.

Published : 09 Feb 2023 02:11 IST

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే ఈశ్వరి

జి.మాడుగుల, న్యూస్‌టుడే: అభివృద్ధి అంటే బటన్‌ నొక్కడం కాదని, ప్రతి పల్లెలో మౌలిక వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి జగన్‌కు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సూచించారు. నుర్మతి పంచాయతీ గాదెగుంటలో నియోజకవర్గ తెదేపా పరిశీలకుడు రాజమండ్రి నారాయణతో కలిసి ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అన్ని వర్గాల ప్రజలను మోసగిస్తున్నారని ఈశ్వరి దుయ్యబట్టారు. గిరి రైతులకు గంజాయి ప్రత్యామ్నాయ పంటలు పండించేందుకు ప్రోత్సాహం అందించాలన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. గాదెగుంట వరకు నిర్మిస్తున్న రహదారిని నిలిపేయడం ఎమ్మెల్యేకు తగదన్నారు. ఈ ప్రాంత వాసులపై అక్రమ కేసులు బనాయించడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. కార్యకర్తలందరూ ఒకే తాటిపై నిలబడి తెదేపా విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సర్పంచులు సూరిబాబు, కృష్ణమూర్తి, ఎంపీటీసీ సభ్యుడు అప్పలరాజు, తెదేపా నాయకులు చిట్టిబాబు, కొండలరావు, భీంబాబు, భాస్కరరావు, కొండబాబు, రామారావు, బొంజుబాబు, లక్ష్మయ్య, చిరంజీవినాయుడు, రమణబాబు, ఎర్రయ్య, రామకృష్ణ, సతీష్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని