logo

కూలిన చెట్టు.. అంబులెన్సుకు ఆటంకం

గర్భిణిని ఆసుపత్రికి తరలించడానికి వెళ్లిన 108 అంబులెన్సుకు అడ్డంగా రహదారిపై చెట్టు కూలిపోవడంతో చాలాసేపు వాహనం నిలిచిపోవాల్సి వచ్చింది.

Published : 09 Feb 2023 02:11 IST

గర్భిణిని ఆసుపత్రికి తరలించడానికి వెళ్లిన 108 అంబులెన్సుకు అడ్డంగా రహదారిపై చెట్టు కూలిపోవడంతో చాలాసేపు వాహనం నిలిచిపోవాల్సి వచ్చింది. మారేడుమిల్లి మండలంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సున్నంపాడు పంచాయతీ తుర్రూరు గ్రామానికి చెందిన సునీత నిండు గర్భిణి. బుధవారం ఉదయం ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభం కావడంతో అంబులెన్సుకు సమాచారం అందించారు. పైలట్ ధనుంజయ్‌, ఈఎంటీ కళ్యాణ్‌ చక్రవర్తి హుటాహుటిన మారేడుమిల్లి నుంచి గ్రామానికి చేరుకున్నారు. గర్భిణిని అంబులెన్సులో ఎక్కించుకుని తిరిగి వస్తున్న క్రమంలో మార్గమధ్యంలో ఒక చెట్టు రహదారికి అడ్డంగా కూలిపోయింది. దీంతో అంబులెన్సు నిలిచిపోయింది. గిరిజనులు అక్కడకు చేరుకుని కూలిన చెట్టును నరికి పక్కకు తొలగించడంతో అంబులెన్సుకు మార్గం సుగమమైంది.

న్యూస్‌టుడే, మారేడుమిల్లి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు