logo

‘హైడ్రో ప్రాజెక్టులతో కేంద్రానికి సంబంధం లేదు’

ఎర్రవరంలో హైడ్రోపవర్‌ ప్రాజెక్టు నిర్మాణం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరుగుతుందని, కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని భాజపా గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కురుసా ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా కృష్ణారావు స్పష్టంచేశారు.

Published : 09 Feb 2023 02:11 IST

మాట్లాడుతున్న కురుసా ఉమామహేశ్వరరావు

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: ఎర్రవరంలో హైడ్రోపవర్‌ ప్రాజెక్టు నిర్మాణం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరుగుతుందని, కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని భాజపా గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కురుసా ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా కృష్ణారావు స్పష్టంచేశారు. బుధవారం స్థానిక భాజపా కార్యాలయంలో ఆ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ హైడ్రోపవర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి, కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. కేంద్రంపై బురద జల్లే ప్రయత్నం ఇక్కడి నాయకులు చేస్తున్నారని, దీన్ని తాము ఖండిస్తున్నామన్నారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే తీర్మానం చేసిన తరువాతే ప్రాజెక్టు నిర్మాణానికి రంగం సిద్ధం చేసుకున్నారన్నారు. ఆదివాసీ గిరిజనుల సంక్షేమం కోసం భాజపా పాటుపడుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి అనుమతులు నిలిపేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గిరిజనుల తరపున పోరాటాలు చేస్తామన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్రం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. గిరిజనులకు 20 లక్షల ఇళ్లు, జలజీవన్‌ మిషన్‌ ద్వారా కోట్లాది రూపాయలతో ఇంటింటికీ తాగునీరు పథకం ఏర్పాటు చేస్తున్నామన్నారు. వైకాపా ప్రభుత్వం పింఛన్లు, రేషన్‌కార్డులు తొలగిస్తోందని ఆరోపించారు. మార్చి 10 నుంచి 30 వరకు నుంచి ప్రజాపోరు యాత్ర నిర్వహిస్తామని తెలిపారు. నాయకులు బోనంగి బాలయ్యపడాల్‌, బాలకృష్ణ, వసుపరి శ్రీను, కదుల్ల శ్రీను, శివ తదితరులు పాల్గొన్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు