logo

అంగన్‌వాడీ కార్యకర్తల గృహ నిర్బంధం

అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 20న విజయవాడలో నిర్వహించే ధర్నాకు జిల్లా నుంచి బయల్దేరుతున్న అంగన్‌వాడీ కార్యకర్తలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.

Published : 19 Mar 2023 01:14 IST

పాడేరులో అంగన్‌వాడీ కార్యకర్తల సంఘం జిల్లా కార్యదర్శి భాగ్యలక్ష్మి నివాసం వద్ద ఎస్సై రంజిత్‌, పోలీసులు

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 20న విజయవాడలో నిర్వహించే ధర్నాకు జిల్లా నుంచి బయల్దేరుతున్న అంగన్‌వాడీ కార్యకర్తలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పాడేరులో అల్లూరి జిల్లా అంగన్‌వాడీ కార్యకర్తల సంఘం కార్యదర్శి భాగ్యలక్ష్మి నివాసం వద్దకు వెళ్లి పోలీసులు వెళ్లి ఆమెను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన వ్యతిరేకతను చూసైనా వైకాపా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలన్నారు. అంగన్‌వాడీ సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేసి ఉద్యమాన్ని ఆపాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు అన్నారు. వెంటనే వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు