గుంత పూడదు.. గండం తప్పదు
రహదారులపై గోతులు కనిపించకూడదు. వర్షాలు తగ్గిన వెంటనే గుంతలన్నీ పూడ్చేయాలి. వాటి ఫొటోలు తీసి నాడు, నేడు రూపంలోసచివాలయాల దగ్గర ప్రదర్శించాలి
పూడ్చేందుకు ససేమిరా అంటున్న గుత్తేదారులు
మూడేళ్లుగా టెండర్లు, ఒప్పందాలతోనే కుస్తీలు
ఈనాడు డిజిటల్, పాడేరు
ఎస్.రాయవరం మండలంలోని పెద ఉప్పలం రోడ్డు
రహదారులపై గోతులు కనిపించకూడదు. వర్షాలు తగ్గిన వెంటనే గుంతలన్నీ పూడ్చేయాలి. వాటి ఫొటోలు తీసి నాడు, నేడు రూపంలో సచివాలయాల దగ్గర ప్రదర్శించాలి
నాలుగేళ్లలో గ్రామాల్లోని రోడ్ల పరిస్థితిలో పెద్దగా మార్పులు కనిపించలేదు. గోతులతో వాహనచోదకులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.
...రోడ్ల మరమ్మతులపై సమీక్షించినప్పుడల్లా ముఖ్యమంత్రి జగన్ చెప్పే మాటలివి...
ఉమ్మడి జిల్లాలో పంచాయతీరాజ్‌శాఖ పరిధిలో గ్రామీణ రోడ్లపై గుంతలు పూడ్చేందుకు రూ. 71.71 కోట్లతో అంచనాలు తయారు చేయడం. 20 ప్యాకేజీలుగా టెండర్లు పిలవడం అన్నీ జరిగిపోయాయి. అందులో ఏజెన్సీలో పనులకే బిడ్లు వేశారు. వాటిలో ఒకటి రెండు పనులు చేసి బిల్లులందక మిగతావాటిని అసంపూర్తిగా వదిలేశారు. బిడ్లు దాఖలు చేసినవారు కూడా ఒప్పందాలకు వెనుకంజ వేశారు. ఇక మైదాన ప్రాంతంలో మంత్రి బూడి ముత్యాలనాయుడు కొంత చొరవ తీసుకుని తమ నియోజకవర్గంలో రోడ్లను మెరుగుపర్చుకున్నారు.. మిగతా నియోజకవర్గాల్లో చిన్న గోతులు కాస్తా క్రమేపీ పెద్దపెద్ద గొయ్యిలుగా మారిపోయాయి. వీటిని పూడ్చి రహదారిపై ప్రయాణం సాఫీగా సాగేలా మరమ్మతులు చేయడానికి పలుమార్లు టెండర్లు పిలుస్తున్నా గుత్తేదారుల నుంచి అసలు స్పందనే లేదు.
నిధుల్లేకుండా పనులంటే ఎట్టా..
గ్రామీణ ప్రాంతాల్లో లింకురోడ్ల అభివృద్ధి పేరుతో వ్యవసాయ మార్కెట్ కమిటీల (ఏఎంసీ) నిధులతో రహదారుల మరమ్మతులు చేపట్టాలనుకున్నారు. ఆ నిధులు అందుబాటులోకి రాకపోవడంతో బ్యాంకు నుంచి రుణం తీసుకుని పనులు చేపట్టాలని సర్కారు నిర్ణయించింది. ఇంతవరకు ఆ రుణంపైనా స్పష్టత లేకుండా పోయింది. మరమ్మతులకు ఏ నిధులు ఖర్చు చేస్తుందో చెప్పకుండా టెండర్లు పిలిస్తే ఎవరొస్తారని ఆ శాఖలోని ఇంజినీరింగ్ అధికారులే అంటున్నారు. గుత్తేదారులను వ్యక్తిగతంగా పిలిచి బిల్లులకు మేం హామీ ఇస్తున్నాం... పనులు చేయడానికి ముందుకు రావాలని కోరుతున్నా ససేమిరా అంటున్నారు.
ఈ రోడ్ల దుస్థితి మారేదెన్నడో?
పాయకరావుపేట నియోజకవర్గంలో 23 కి.మీ మేర ఎనిమిది రోడ్లపై గోతులను పూడ్చేందుకు రూ. 4.24 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. గుంటపల్లి - ఒడ్డిమెట్ట రోడ్డు, గోపాలపట్నం నుంచి నక్కపల్లి మండలం గునిపూడి, జాతీయ రహదారి నుంచి సీతారాంపురం, కొత్తూరు - సత్యవరం, కోటవురట్ల మండలంలోని ఎండపల్లి నుంచి వేములపూడి, నక్కపల్లి మండలంలో ఉపమాక నుంచి జానకయ్యపేట, ఎస్.రాయవరం మండలంలోని పెద ఉప్పలం రోడ్లకు కొత్తరూపు తీసుకువచ్చేందుకు ప్రతిపాదనలు పంపించారు. నిధులు మంజూరు కాకపోవడంతో మూడేళ్లయినా వీటి దుస్థితిలో మార్పు రాలేదు.
* చోడవరం నియోజకవర్గంలో చోడవరం నుంచి చాకిపల్లి మీదుగా వెళ్లే 9.8 కి.మీ., బి-ఎన్ రహదారి నుంచి రాయపురాజు పేటకు వయా అంభేరుపురం మీదుగా వెళ్లే రహదారి, చోడవరం నుంచి అంకుపాలెం రోడ్డు, బి-ఎన్ రహదారి నుంచి లక్ష్మీపురం వెళ్లే దారి, గంటికొర్లాం మార్గాలను అభివృద్ధి చేయాలనుకున్నారు. గతంలో రెండు దఫాలు టెండర్లు పిలిచినా ఫలితం లేకుండా పోయింది. మళ్లీ మూడోసారి టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతున్నారు.
గోతులతో అధ్వానంగా నునపర్తి-వాడచీపురుపల్లి రోడ్డు
గ్రాంట్ ఇంకా రాలేదు.. : రోడ్లపై గోతులు పూడ్చేందుకు అవసరమైన గ్రాంట్ ఇంకా రాలేదు. అప్పట్లో ఏజెన్సీలో కొన్ని పనులు మొదలుపెట్టినా నిధులు లేక తాత్కాలికంగా వాటిని నిలిపారు. మాడుగుల నియోజకవర్గంలో మూడు రోడ్లు బాగుచేశారు. నిధులు అందుబాటులోకి వస్తే మిగతా పనులన్నింటికీ మళ్లీ టెండర్ పిలవడానికి అవకాశం ఉంటుంది.
కె.శ్రీనివాస్, పంచాయతీరాజ్ ఈఈ
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Weather Report: తెలంగాణలో రాగల 3రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Jayanth C Paranjee: త్రిషకు వేరే వ్యక్తితో పెళ్లి చేయడం వాళ్లకు నచ్చలేదు: జయంత్ సి.పరాన్జీ
-
India News
Odisha Train Accident: మృతులు 288 కాదు.. 275 మంది: ఒడిశా ప్రభుత్వం క్లారిటీ
-
Politics News
Bandi sanjay: తెదేపాతో భాజపా పొత్తు ఊహాగానాలే..: బండి సంజయ్
-
India News
Guwahati airport: కేంద్ర మంత్రి ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్