logo

డౌనూరు వైద్యాధికారి, డ్రైవర్‌ జీతం నిలిపివేత

చింతపల్లి ప్రాంతీయ ఆసుపత్రిలో మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి గోపాలకృష్ణ పేర్కొన్నారు.

Published : 21 Mar 2023 01:20 IST

చింతపల్లి ఆసుపత్రిలో వైద్యులతో మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ, చిత్రంలో డీసీహెచ్‌ శంకర్‌ప్రసాద్‌, డాక్టర్‌ కీర్తి

చింతపల్లి గ్రామీణం, కొయ్యూరు, న్యూస్‌టుడే: చింతపల్లి ప్రాంతీయ ఆసుపత్రిలో మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారి గోపాలకృష్ణ పేర్కొన్నారు. సోమవారం ఆసుపత్రిని సందర్శించి వైద్యసేవలపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఆసుపత్రి శస్త్రచికిత్స గది సిద్ధం చేయాలని సూచించారు. వచ్చిన రోగులతో మాట్లాడి అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం లంబసింగి, తాజంగి గ్రామ సచివాలయాలను తనిఖీలు చేశారు. సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. ముఖహాజరు తప్పనిసరిగా నమోదు చేయాలని చెప్పారు. డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ శంకర్‌ప్రసాద్‌, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కృష్ణారావు, ఎంపీడీఓ సీతయ్య, చింతపల్లి ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కీర్తి తదితరులు పాల్గొన్నారు.

* అనంతరం కొయ్యూరు మండలం డౌనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పీఓ గోపాలకృష్ణ ఆకస్మికంగా తనిఖీచేశారు. హాజరుపట్టీ, రికార్డులు పరిశీలించారు. వైద్యాధికారి లలిత, అంబులెన్స్‌ డ్రైవర్‌ కాంతారావు విధులకు గైర్హాజరైనట్లు గుర్తించారు. వీరిద్దరి జీతాలు నిలిపేయాలని డీఎంహెచ్‌ఓను ఆదేశించారు. మందుల నిల్వలు, ఆసుపత్రిలో జరుగుతున్న ప్రసవాలపై ఆరా తీశారు. విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించబోమని హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని