logo

అనారోగ్యంతో బాలిక మృతి

హుకుంపేట మండలం గత్తుం పంచాయతీకి చెందిన పదేళ్ల బాలిక సోమవారం అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

Published : 21 Mar 2023 01:20 IST

శాంతి మృతదేహం

హుకుంపేట, న్యూస్‌టుడే: హుకుంపేట మండలం గత్తుం పంచాయతీకి చెందిన పదేళ్ల బాలిక సోమవారం అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. గాలిపాడు గ్రామానికి చెందిన వళ్లాయి అప్పన్న, మల్లమ్మల కుమార్తె వల్లాయి శాంతి గ్రామంలోని పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. కొన్ని రోజులుగా ఈ బాలిక ఆరోగ్యం బాగోలేక పోవటంతో తల్లిదండ్రులు విశాఖ కేజీహెచ్‌కు తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. పాప ఆరోగ్యం బాగోలేదని.. ఆర్థికంగా ఆదుకోవాలని తల్లిదండ్రులు పాడేరు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ను కలిశారు. కలెక్టర్‌ స్పందించి ఖర్చుల నిమిత్తం రూ. 5 వేలు సహాయం అందించాలని కార్యాలయంలో ఉన్న వరుణ్‌కుమార్‌కు సూచించారని.. అయితే ఆయన రూ. వెయ్యి ఇచ్చి పంపించారని పాప తల్లిదండ్రులు పేర్కొన్నారు. కేజీహెచ్‌లో సక్రమంగా వైద్యం అందక, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చూపించుకోనే స్థోమత లేకపోవడంతోనే తమ కుమార్తె ఆరోగ్యం క్షీణించి మృతి చెందిందని వారు రోదించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు