logo

పరిహారం ఇప్పించరూ..

గత నెల తొమ్మిదో తేదీన కాకినాడ జిల్లా పెద్దాపురం మండల రాగంపేటలోని ఆయిల్‌ కంపెనీలో చోటుచేసుకున్న ప్రమాదంలో మృతి చెందిన ఐదుగురు గిరిజనుల కుటుంబాలకు ఇప్పటివరకు ప్రభుత్వం, కంపెనీ నుంచి ఎటువంటి నష్ట పరిహారం అందలేదు.

Published : 21 Mar 2023 01:20 IST

కలెక్టర్‌ను కలిసేందుకు వచ్చిన బాధిత కుటుంబసభ్యులు

పాడేరు, న్యూస్‌టుడే: గత నెల తొమ్మిదో తేదీన కాకినాడ జిల్లా పెద్దాపురం మండల రాగంపేటలోని ఆయిల్‌ కంపెనీలో చోటుచేసుకున్న ప్రమాదంలో మృతి చెందిన ఐదుగురు గిరిజనుల కుటుంబాలకు ఇప్పటివరకు ప్రభుత్వం, కంపెనీ నుంచి ఎటువంటి నష్ట పరిహారం అందలేదు. ఈ క్రమంలో సోమవారం వీరంతా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ను కలిసి పరిహారం త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ ప్రమాదంలో పెదబయలు మండలం లక్ష్మిపురం, వంచెడిపుట్టు, చెంపపుట్టు గ్రామానికి చెందిన వెచ్చంగి కృష్ణారావు, వెచ్చంగి సాగర్‌, వెచ్చంగి నరసింహరావు, కుర్తాడి బొంజన్న, రామారావు మృతి చెందారు. ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షల వరకు నష్ట పరిహారం ఇచ్చేందుకు నిర్ణయించారు. ఇందులో రూ.25 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం, కంపెనీ మరో రూ.25 లక్షలు ఇవ్వాల్సి ఉంది. ప్రమాదం జరిగి దాదాపు 40 రోజులు దాటుతున్నా బాధిత కుటుంబాలకు పరిహారం అందలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని