logo

నేలవాలిన మొక్కజొన్న

మండలంలో గురువారం సాయంత్రం కురిసిన వర్షానికి మొక్కజొన్న రైతులకు మళ్లీ అవస్థలు మొదలయ్యాయి.

Published : 24 Mar 2023 02:35 IST

ఎ.వీరవరం వద్ద పడిపోయిన మొక్కజొన్న పైరు

దేవీపట్నం, న్యూస్‌టుడే: మండలంలో గురువారం సాయంత్రం కురిసిన వర్షానికి మొక్కజొన్న రైతులకు మళ్లీ అవస్థలు మొదలయ్యాయి. ఈదురు గాలులతో కురిసిన వర్షంతో దండంగి, పూడిపల్లి, ఎ.వీరవరం పరిసర ప్రాంతాల్లో పొలాల్లో ఆరబెట్టిన మొక్కజొన్న పొత్తులు తడిసిపోయాయని రైతులు తీవ్ర ఆందోళన చెందారు. ఎ.వీరవరం, పూడిపల్లి పరిసర ప్రాంతాల్లో చేతికి వచ్చిన మొక్కజొన్న చేలు నేలవాలడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఇందుకూరుపేట, ఇందుకూరు పరిసర ప్రాంతాల్లోనూ మొక్కజొన్న రైతులకు నష్టాలు తప్పడం లేదు.  

రాజవొమ్మంగి: ఉర్లాకులపాడు శివారున ఏలేశ్వరం-నర్సీపట్నం ప్రధాన రహదారిపై భారీ వృక్షం గాలులతో నేలకొరిగింది. దీనితో 2 గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. స్థానిక యువకులు చెట్టు కొమ్మలను తొలగించారు. 516-ఈ జాతీయ రహదారిపై పలుచోట్ల జిగురుమట్టితో తంటికొండ, సింగంపల్లి, జడ్డంగిల్లో ద్విచక్ర వాహనదారులు నానా తంటాలుపడ్డారు. 104 వాహనం గంటసేపు బురదలో నిలిచిపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని