logo

సౌభ్రాతృత్వానికి నిదర్శనం.. రంజాన్‌ మాసం

పండగలు.. ఉపవాస దీక్షలు, ఆరాధనలు, మానవ జీవితంలో ప్రేమ, సోదరభావం, మానవత్వం వంటి సద్గుణాలను పెంపొందిస్తాయి.

Published : 24 Mar 2023 02:35 IST

నేటి నుంచి రంజాన్‌ నెల ప్రారంభం

చింతపల్లిలో ముస్లింల ప్రార్థనలు

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: పండగలు.. ఉపవాస దీక్షలు, ఆరాధనలు, మానవ జీవితంలో ప్రేమ, సోదరభావం, మానవత్వం వంటి సద్గుణాలను పెంపొందిస్తాయి. ఇస్లాం ధర్మంలో రంజాన్‌ మాసానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. రంజాన్‌ వచ్చిందంటే ఏటా 30 రోజుల పాటు చిన్న, పెద్ద వయస్సు తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఉపవాసదీక్షను ఆచరిస్తారు. శుక్రవారం నుంచి రంజాన్‌ నెల ప్రారంభం కానుంది.

జిల్లాలో వేలాది మంది ముస్లింలు ఉన్నారు. వీరిలో చిన్న, పెద్ద, వృద్ధులతో కలిసి సుమారు 70 శాతం రంజాన్‌ నెల కఠోర ఉపవాస దీక్ష చేపడతారు. రంజాన్‌ మాసంలోని 30 రోజుల్లో ఆఖరి పది రోజులపై మరింత శ్రద్ధ చూపుతారు. ఆ రోజుల్లో వచ్చే బేసి రాత్రంతా జాగారం చేస్తారు. ఈ ఐదు రోజుల్లో లైలతుల్‌ ఖద్ర్‌ (పెద్దరాత్రి) కోసం అన్వేషిస్తారు. ఈ ఐదు రోజుల్లో రాత్రంతా అల్లాహ్‌ నామస్మరణలో గడుపుతారు. ప్రత్యేక నమాజ్‌లు, ఖురాన్‌ పారాయణం, దువా చేస్తారు.
* రంజాన్‌ మాసంలో ఒక్క రూపాయి దానం చేస్తే రూ.70 పుణ్యఫలం లభిస్తుందన్న ప్రవక్త మహమ్మద్‌ ప్రవక్త బోధనలు అనుసరించి ముస్లింలు పెద్ద ఎత్తున దానధర్మాలు చేస్తారు. పేదలు సైతం పండగను సంతోషంగా జరుపుకొంటారు. ప్రతి ఒక్కరు ఫిత్రా దానం చేయాలి. ఇది సర్వమానవ సౌభ్రాతృత్వానికి బాటలు వేస్తుంది.

ఓర్పు, సహనం అలవడతాయి

ఆహారం కోసం అనేక కష్టాలు పడే వారి బాధలు ధనవంతులకు తెలియాలన్నదే రంజాన్‌ మాస  ఉద్దేశం. ఈ మాసంలో పాటించే ఉపవాస దీక్ష ఆకలి బాధను తెలియజేస్తుంది. జీవితంలో ఎదిగేందుకు ఓర్పు, సహనం అలవాట్లు అవుతుంది. ధనికులు, పేదవారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సమానంగా ఈదుల్‌ ఫితర్‌ నమాజ్‌ ఆచరిస్తారు. ఆర్థిక స్థోమత ఉన్న ప్రతి ఒక్కరూ పేదలకు దానం చేయాలి.
కబీరుద్దీన్‌, మసీదు గురువు, చింతపల్లి.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని