logo

యువతకు ఆదర్శం భగత్‌సింగ్‌

దేశాన్ని దాస్య సంకెళ్ల నుంచి విముక్తికోసం ఉరి కంబాన్ని ముద్దాడిన అమరులు భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖదేవ్‌లను యువత ఆదర్శంగా తీసుకోవాలని అరకులోయ ప్రభుత్వ డిగ్రీ, మహిళా డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు నాయక్‌, రామకృష్ణ అన్నారు.

Published : 24 Mar 2023 02:35 IST

అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నివాళులు అర్పిస్తున్న ప్రిన్సిపాళ్లు నాయక్‌, రామకృష్ణ, సిబ్బంది

అరకులోయ పట్టణం, న్యూస్‌టుడే: దేశాన్ని దాస్య సంకెళ్ల నుంచి విముక్తికోసం ఉరి కంబాన్ని ముద్దాడిన అమరులు భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖదేవ్‌లను యువత ఆదర్శంగా తీసుకోవాలని అరకులోయ ప్రభుత్వ డిగ్రీ, మహిళా డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు నాయక్‌, రామకృష్ణ అన్నారు. కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌, చరిత్ర విభాగాల ఆధ్వర్యంలో అమరుల త్యాగాలను స్మరిస్తూ వారి వర్ధంతిని నిర్వహించారు. ఎన్‌ఎస్‌ఎస్‌ పీఓలు విజయలక్ష్మి, నాగబాబు, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. భగత్‌సింగ్‌ వర్థంతిని అరకులోయ గిరిజన సంఘం కార్యాలయంలో గిరిజన సంఘం, సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐల ఆధ్వర్యంలో నిర్వహించారు. అమరుల స్ఫూర్తితో గిరిజన హక్కులకై యువత నినదించాలని గిరిజనసంఘం, సీఐటీయూ నాయకులు ఉమామహేశ్వరరావు, బాలదేవ్‌ అన్నారు.  

మోతుగూడెం, ఎటపాక, న్యూస్‌టుడే: ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు, కార్పొరేట్‌ అనుకూల విధానాలపైన రాజీ లేని పోరాటాలు నిర్వహించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు పల్లపు వెంకట్‌ అన్నారు. చింతూరు మండలం గూడూరు పంచాయతీ గూడూరు, గొడ్లగూడెం, దేవరపల్లి, అల్లిగూడెంల్లో గురువారం భగత్‌సింగ్‌, రాజగురు, సుఖదేవ్‌ వర్ధంతిని నిర్వహించారు. పొడియ అక్ష్మణ్‌, రమేష్‌, శేషు, సత్యనారాయణ, నాగేశ్వరరావు, రఘు, జ్యోతి, భీమయ్య, రాధిక, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. ఎటపాక మండలంలో సీపీఎం మండల అధ్యక్షుడు ఇసంపల్లి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రతిజ్ఞ నిర్వహించారు. ఆకిశెట్టి రాము, ఆయా పార్టీ శాఖల సభ్యులు పాల్గొన్నారు.
కూనవరం, న్యూస్‌టుడే: భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లు దేశం మెచ్చిన నాయకులని సీపీఎం మండల కార్యదర్శి పాయం సీతారామయ్య అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆ నాయకుల వర్ధంతి సభ నిర్వహించి వారి సేవలను కొనియాడారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు.
చింతపల్లి గ్రామీణం: స్థానిక పభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో కలిసి భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ వర్ధంతి నిర్వహించారు. సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.  భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ) జిల్లా ఉపాధ్యక్షుడు జీవన్‌కృష్ణ, నాయకులు కార్తీక్‌, విద్యార్థులు పాల్గొన్నారు.
ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే: ముంచంగిపుట్టు గిరిజన సంఘం కార్యాలయంలో సీపీఎం, గిరిజన సంఘం, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం నాయకులు, మహిళా సంఘం ప్రతినిధులు భగత్‌సింగ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వివిధ సంఘాల నేతలు శ్రీను, భీమరాజు, వరహాలుబాబు, ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని