logo

పిల్లల ఆరోగ్యంపై అప్రమత్తం

చిన్న పిలల్లో వచ్చే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, రక్తం తక్కువగా ఉన్న పిల్లలు తలసేమియా వ్యాధి బారినపడుతున్నారని కాకినాడ రెడ్‌క్రాస్‌ సొసైటీ డాక్టర్‌ పరాశర అన్నారు.

Published : 27 Mar 2023 04:38 IST

రక్తదాతలకు ధ్రువపత్రాలను అందజేస్తున్న డాక్టర్‌ పరాశర, గిరిజన మిత్ర మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఉదయశ్రీనివాస్‌

రంపచోడవరం, న్యూస్‌టుడే: చిన్న పిలల్లో వచ్చే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, రక్తం తక్కువగా ఉన్న పిల్లలు తలసేమియా వ్యాధి బారినపడుతున్నారని కాకినాడ రెడ్‌క్రాస్‌ సొసైటీ డాక్టర్‌ పరాశర అన్నారు. గిరిజన మిత్ర ఫౌండేషన్‌, కోఆపరేటివ్‌ బ్లడ్‌ డోనర్స్‌ వాలంటరీ అసోసియేషన్‌ (శ్రీరామ్‌ ఐకేర్‌ రెటీని సెంటర్‌) ఆధ్వర్యంలో స్థానిక ఐటీడీఏ కార్యాలయం వద్ద ఆదివారం రక్తదాన, కంటి వైద్య శిబిరాలు నిర్వహించారు. రోగులకు కంటి పరీక్షలు చేసి మందులు అందజేశారు. డాక్టర్‌ పరాశర మాట్లాడుతూ తలసేమియా సోకిన పిల్లలకు 15 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించాలన్నారు. వీరి కోసం రక్తదాన శిబిరాన్ని నిర్వహించినట్లు తెలిపారు. రక్తదాతలకు ధ్రువపత్రాలు అందజేశారు. గిరిజన మిత్ర మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఉదయశ్రీనివాస్‌, వైద్య సిబ్బంది సంజీవ్‌, రాణి, రాజు, ఆలీషా, ప్రతినిధులు సుధాకర్‌, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని