logo

పింఛను ఇప్పించరూ..

తన దివ్యాంగ పింఛను పునరుద్ధరించాలని మండలంలోని పోతంగి గ్రామానికి చెందిన గొల్లోరి నత్తొ కోరుతున్నారు. పుట్టుకతోనే ఇతడు దివ్యాంగుడు.

Published : 27 Mar 2023 04:38 IST

ఆవేదన వ్యక్తం చేస్తున్న నత్తొ

డుంబ్రిగుడ, న్యూస్‌టుడే: తన దివ్యాంగ పింఛను పునరుద్ధరించాలని మండలంలోని పోతంగి గ్రామానికి చెందిన గొల్లోరి నత్తొ కోరుతున్నారు. పుట్టుకతోనే ఇతడు దివ్యాంగుడు. గత ప్రభుత్వ హయాంలో పింఛను ఇచ్చేవారు. కుమారుడికి సచివాలయంలో ఉద్యోగం వచ్చిందనే సాకుతో పింఛను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగం నిమిత్తం కుమారుడు వేరే ప్రాంతంలో ఉండటంతో ఒక చేత్తో పనిచేయలేని దుస్థితితో కుటుంబ పోషణ కష్టంగా మారిందన్నారు. అధికారులు స్పందించి దివ్యాంగ పింఛను పునరుద్ధరించి ఆదుకోవాలని ఆయన కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని