logo

‘ఆదివాసులకు ప్రభుత్వం వెన్నుపోటు’

బోయ వాల్మీకి, బెంతు ఒరియా కులాలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ శాసనసభలో చేసిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ జిల్లావ్యాప్తంగా గిరిజనులు ఆందోళనబాట పట్టారు.

Updated : 28 Mar 2023 06:23 IST

జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌కు వినతిపత్రం అందజేస్తున్న ఆదివాసీ ఉద్యమ జేఏసీ నాయకులు రామారావుదొర, శేషాద్రి, గంగులయ్య తదితరులు

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: బోయ వాల్మీకి, బెంతు ఒరియా కులాలను ఎస్టీ జాబితాలో చేరుస్తూ శాసనసభలో చేసిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ జిల్లావ్యాప్తంగా గిరిజనులు ఆందోళనబాట పట్టారు. ఆదివాసీ ఉద్యమ జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 31న  రాష్ట్రవ్యాప్తంగా మన్యం బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ బంద్‌కు అనుమతులు ఇవ్వాలని కోరుతూ ఆదివాసీ ఉద్యమ జేఏసీ నేతలు సోమవారం జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, ఎస్పీ సతీష్‌కుమార్‌లకు వినతిపత్రాలు అందించారు. జేఏసీ జిల్లా కన్వీనర్‌ రామారావుదొర మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులు ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ వాటిని ఏనాడూ పట్టించుకోని ప్రభుత్వం ఇతర కులాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు యత్నిస్తోందన్నారు. అశాస్త్రీయ పద్ధతిలో శాసనసభలో తీర్మానం చేసి ఆదివాసులకు ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందన్నారు. తక్షణమే ఈ తీర్మానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఉద్యమం మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. హింసకు తావు లేకుండా బంద్‌ పాటించాలని ఎస్పీ సూచించారు. ఆదివాసీ ఉద్యమ జేఏసీ నాయకులు రామారావుదొర, గిరిజన ఉద్యోగుల సంఘం నాయకులు శేషాద్రి, సింహాచలం, ప్రసాద్‌రావు, జనసేన అరకు పార్లమెంట్‌ ఇన్‌ఛార్జి గంగులయ్య, తెదేపా రాష్ట్ర కార్యదర్శి బొర్రా నాగరాజు, భాజపా నాయకులు కురుసా ఉమామహేశ్వరరావు, కృష్ణారావు, గురుస్వామి, గంగరాజు, వివిధ సంఘాల ప్రతినిధులు సుమన్‌, ఆనంద్‌, అనిల్‌, మాధవ్‌, సోమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని