logo

ఎన్నికల హామీలన్నీ అమలు

రుణ మాఫీ అంటూ డ్వాక్రా మహిళలకు గత ప్రభుత్వంలో అప్పటి సీఎం చంద్రబాబునాయుడు మోసం చేశారని ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి విమర్శించారు.

Published : 28 Mar 2023 05:07 IST

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

పాడేరు, న్యూస్‌టుడే: రుణ మాఫీ అంటూ డ్వాక్రా మహిళలకు గత ప్రభుత్వంలో అప్పటి సీఎం చంద్రబాబునాయుడు మోసం చేశారని ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి విమర్శించారు. స్థానిక మోదకొండమ్మ ఆడిటోరియం ప్రాంగణంలో సోమవారం వైఎస్సార్‌ మూడో విడత ఆసరా సంబరాలు నిర్వహించారు. లబ్ధిదారులకు ఎమ్మెల్యే నమూనా చెక్కు ఎమ్మెల్యే అందజేశారు. ఆమె మాట్లాడుతూ 2019 ఎన్నికలకు ముందు ఇచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారన్నారు. ఆసరా పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వెలుగు ఏపీడీ మురళి, పాడేరు ఎంపీపీ రత్నకుమారి, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు