logo

ఉపాధి పనుల్లో అవకతవకలు సహించం

ఉపాధి హామీ పథకం పనుల్లో అవకతవకలు జరిగితే సిబ్బంది, అధికారులపై కఠిన చర్యలు తప్పవని డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌ రమేష్‌రామన్‌ హెచ్చరించారు.

Published : 28 Mar 2023 05:07 IST

ఎటపాకలో పనుల వివరాలు తెలుసుకుంటున్న డ్వామా పీడీ రమేష్‌ రామన్‌

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: ఉపాధి హామీ పథకం పనుల్లో అవకతవకలు జరిగితే సిబ్బంది, అధికారులపై కఠిన చర్యలు తప్పవని డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌ రమేష్‌రామన్‌ హెచ్చరించారు. మారేడుమిల్లిలోని ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కార్యాలయం వద్ద సోమవారం సామాజిక తనిఖీ ప్రజావేదికను నిర్వహించారు. మండలంలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనులపై సమీక్షించారు. ఎటువంటి అవకతవకలు జరగలేదంటూ నామమాత్రంగా సభ ముగించారు. జిల్లా విజిలెన్సు అధికారిణి నిర్మలాదేవి, ఎంపీపీ సార్ల లలితకుమారి, జడ్పీటీసీ సభ్యుడు గొర్లె బాలాజీబాబు, వైస్‌ ఎంపీపీ రవికుమార్‌, ఎంపీడీవో రమణమూర్తి, ఏపీవో రెడ్డిబాబు తదితరులు పాల్గొన్నారు.

ఎటపాక, న్యూస్‌టుడే: ఎటపాక మండలంలోని 21 పంచాయతీల పరిధిలో గత ఆర్థిక సంవత్సరంలో చేసిన పనులపై డ్వామా పీడీ రమేష్‌రామన్‌ ఆధ్వర్యంలో ప్రజావేదిక నిర్వహించారు. నిబంధనల ప్రకారం ఉపాధి హామీ పనులు చేపట్టాలన్నారు. కూలీల మస్తర్‌ వివరాలను ప్రతిరోజూ ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని చెప్పారు. ఎంపీపీ కామేశ్వరి, ఏపీడీ రోశయ్య, ఎంపీడీవో విఠల్‌పాల్‌, ఏపీవో అరవాలు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని