logo

చలో దిల్లీ 5న

ఏప్రిల్‌ 5న దిల్లీలో నిర్వహించే కార్మిక, కర్షక చలో దిల్లీ కార్యక్రమానికి తరలిరావాలని సీఐటీయూ ముంచంగిపుట్టు మండల కార్యదర్శి శంకరరావు కోరారు.

Published : 28 Mar 2023 05:07 IST

అరకులోయ పట్టణం, ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే: ఏప్రిల్‌ 5న దిల్లీలో నిర్వహించే కార్మిక, కర్షక చలో దిల్లీ కార్యక్రమానికి తరలిరావాలని సీఐటీయూ ముంచంగిపుట్టు మండల కార్యదర్శి శంకరరావు కోరారు. ముంచంగిపుట్టులో చలో దిల్లీ గోడపత్రికలను విడుదల చేశారు. రాజు, శంకర్‌, సోనియా, ఈశ్వరి పాల్గొన్నారు. అరకులోయలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బాలదేవ్‌, మండల కమిటీ నాయకులు ప్రభుదాస్‌, భగత్‌రాం, రాజు, కొండలరావు, జోషి, సుబ్బారావు గోడపత్రికలను ఆవిష్కరించారు.

చింతపల్లి, కొయ్యూరు: కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని సీఐటీయూ అల్లూరి జిల్లా అధ్యక్షుడు బోనంగి చిన్నయ్యపడాల్‌ అన్నారు. చింతపల్లిలోని సీఐటీయూ కార్యాలయం గ్రామసేవకులతో కలిసి గోడపత్రికలను ఆవిష్కరించారు. భాజపా ప్రభుత్వం సంపన్నులు, కార్పొరేట్‌ శక్తులకే కొమ్ముకాస్తూ కార్మిక రంగాలను నిర్వీర్యం చేస్తోందన్నారు. గ్రామ సేవకుల సంఘ నాయకులు కృష్ణారావు, లైకోన్‌, కృష్ణ, రమణబాబు, సుందరరావు, కొండమ్మ పాల్గొన్నారు. కొయ్యూరులో గిరిజన సంఘం నేత సూరిబాబు, అంగన్‌వాడీ కార్యకర్తల సంఘ నాయకులు నూకరత్నం, సత్యవతి, వెంకటలక్ష్మి, చిన్నారి గోడపత్రికలను విడుదల చేశారు.

వరరామచంద్రాపురం: రాష్ట్ర ప్రభుత్వం అక్రమ అరెస్టులతో కార్మికులను భయపెట్టలేదని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు కొమరం పెంటయ్య అన్నారు. పెదమట్టపల్లి, చినమట్టపల్లి ప్రధాన రహదారిపె అంగన్‌వాడీ కార్యకర్తలతో నిరసన తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని