logo

అనారోగ్యంతో కిండలం విలవిల పది రోజుల్లో అయిదుగురి మృతి

పెదబయలు మండలం కుంతుర్ల పంచాయతీ కిండలంలో పది రోజుల్లో అనారోగ్యంతో అయిదుగురు మృతిచెందారు.

Published : 29 Mar 2023 01:51 IST

పెదబయలు, న్యూస్‌టుడే: పెదబయలు మండలం కుంతుర్ల పంచాయతీ కిండలంలో పది రోజుల్లో అనారోగ్యంతో అయిదుగురు మృతిచెందారు. వీరిలో ఓ చిన్నారితో పాటు 65 ఏళ్ల వృద్ధురాలు ఉన్నారు. వివరాల్లోకి వెళితే.... కిండలం గ్రామంలో ఒకే వీధిలో ఉంటున్న 65 ఏళ్ల వృద్ధురాలు అనారోగ్యంతో బాధపడుతూ పది రోజుల క్రితం మృతిచెందారు. ఆ తరువాత అదే కుటుంబానికి చెందిన కిముడు బోడంనాయుడు(50) అనే వ్యక్తి మృతిచెందాడు. ఇదే కుటుంబంలో రెండు నెలల చిన్నారి సైతం అనారోగ్యంతో బాధపడుతూ మృతిచెందిందని గ్రామస్థులు తెలిపారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కిముడు కృష్ణారావు(48), కిముడు రామ్మూర్తి(60) కూడా మృతిచెందారు. ప్రస్తుతం గ్రామంలో మరో ముగ్గురు అనారోగ్యంతో బాధపడుతుండగా, వీరిలో ఒకరిని పాడేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరింత మంది ఇబ్బంది పడకుండా నేపథ్యంలో వైద్యసిబ్బంది ప్రత్యేక వైద్యసేవలందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు