logo

‘ఆ తీర్మానం రాజ్యాంగవిరుద్ధం’

బోయ వాల్మీకీలను ఎస్టీ జాబితాలో చేర్పించేందుకు ముఖ్యమంత్రి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి, దాన్ని కేంద్ర ఆమోదానికి సిఫార్సు చేస్తామని చెప్పటం రాజ్యాంగ విర్ధుదమని.

Published : 29 Mar 2023 01:51 IST

విశాఖపట్నం, న్యూస్‌టుడే: బోయ వాల్మీకీలను ఎస్టీ జాబితాలో చేర్పించేందుకు ముఖ్యమంత్రి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి, దాన్ని కేంద్ర ఆమోదానికి సిఫార్సు చేస్తామని చెప్పటం రాజ్యాంగ విర్ధుదమని ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ అనుబంధ సంస్థ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సురేంద్ర, గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కె.సత్యనారాయణలు పేర్కొన్నారు. మంగళవారం ఎంవీపీ గిరిజన భవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈనెల 31న జరిపే రాష్ట్ర మన్యం బంద్‌లో గిరిజన ఉద్యోగులు, ప్రజా సంఘాలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. నాయకులు చిన్నంనాయుడు, బొంజు బాబు, దామోదర్‌, ఆర్‌.సత్యారావు ఇతర నాయకులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని