logo

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్యతో తీవ్ర విషాదం

అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె ఆత్మహత్య చేసుకోవడంతో ఆ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. నగర శివారులోని బోయపాలెం సమీపంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలోని వసతి గృహంలో విద్యార్థిని సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది.

Published : 29 Mar 2023 01:51 IST

చోడవరం, న్యూస్‌టుడే: అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె ఆత్మహత్య చేసుకోవడంతో ఆ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. నగర శివారులోని బోయపాలెం సమీపంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలోని వసతి గృహంలో విద్యార్థిని సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పీఎంపాలెం సీఐ వై.రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గంగవరం గ్రామానికి చెందిన ఎం.చిరంజీవి లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. భార్య ప్రైవేట్‌ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరి పెద్ద కుమార్తెను మధురవాడ దరి బోయపాలెంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ చదివిస్తూ కళాశాల వసతి గృహంలోనే ఉంచుతున్నారు. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాస్తున్న ఆ విద్యార్థిని మార్కులు తక్కువగా వస్తాయన్న భయంతో సోమవారం రాత్రి కళాశాల వసతిగృహంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొద్ది రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతున్నానని అందువల్ల పరీక్ష బాగా రాయలేదని దీనివల్ల మార్కులు తక్కువ వస్తాయన్న భయంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కళాశాల నిర్వాహకులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. తండ్రి చిరంజీవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని