logo

బాలికను వేధిస్తున్న యువకుడి అరెస్టు

గిరిజన బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశామని సీలేరు ఎస్సై జె.రామకృష్ణ తెలిపారు.

Published : 29 Mar 2023 02:22 IST

నిందితుడు గోపాలకృష్ణ వివరాలు వెల్లడిస్తున్న సీలేరు ఎస్సై రామకృష్ణ, ఏఎస్సై అప్పారావు

సీలేరు, న్యూస్‌టుడే: గిరిజన బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశామని సీలేరు ఎస్సై జె.రామకృష్ణ తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులకు అందించిన వివరాలిలా ఉన్నాయి.. గూడెంకొత్తవీధి మండలంలోని ఓ ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలికను పెదబయలు మండలం కోడాసింగి గ్రామానికి చెందిన గోపాలకృష్ణ అనే యువకుడు ప్రేమించాలంటూ వేధిస్తున్నాడు. అంగీకరించకపోవడంతో ఆమె చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నాడు. దీనిపై బాలిక తల్లిదండ్రులు సీలేరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలో దిగిన పోలీసులు నిందితుడు గోపాలకృష్ణను అరెస్ట్‌ చేసి కోర్టుకు తరలించారు. న్యాయమూర్తి నిందితునికి 15 రోజుల రిమాండ్‌ విధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని