logo

గిరిజనుల సేవలో సీఆర్‌పీఎఫ్‌

గిరిజనుల సేవలో సీఆర్‌పీఎఫ్‌ ఉంటుందని సీఆర్‌పీఎఫ్‌ జి42 బెటాలియన్‌ ఉప కమాండెంట్‌  బి.రత్నమ్మ అన్నారు.

Published : 29 Mar 2023 02:22 IST

ఉప కమాండెంట్‌ రత్నమ్మ

గిరిజనులకు భోజనం వడ్డిస్తున్న సీఆర్‌పీఎఫ్‌ అధికారులు

సీలేరు, న్యూస్‌టుడే: గిరిజనుల సేవలో సీఆర్‌పీఎఫ్‌ ఉంటుందని సీఆర్‌పీఎఫ్‌ జి42 బెటాలియన్‌ ఉప కమాండెంట్‌  బి.రత్నమ్మ అన్నారు. మంగళవారం గూడెం కొత్తవీధి మండలం దుప్పిలవాడ పంచాయతీ బూసుకొండలో సీఆర్‌పీఎఫ్‌ ఆధ్వర్యంలో సామాజిక కార్యాచరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రత్నమ్మ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రక్షణ విధులు నిర్వహిస్తున్న   సీఆర్‌పీఎఫ్‌కు గిరిజనుల సేవ చేయడంలో ఎంతో సంతృప్తి ఇస్తుందని అన్నారు. ప్రభుత్వం కూడా విద్యను గిరిజనులకు అందించడానికి అనేక సౌకర్యాలు అందిస్తోందని, వీటిని ఈ ప్రాంత యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని  కోరారు. సీలేరు ఎస్సై రామకృష్ణ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో మొట్టమొదటి సారిగా సీఆర్‌పీఎఫ్‌ ఆధ్వర్యంలో సివిక్‌ యాక్షన్‌ కార్యక్రమం నిర్వహించడం హర్షణీయమన్నారు. దుప్పిలవాడ పంచాయతీ పరిధిలో బూసుకొండ, చిన బూసుకొండ, శాండికొరి గ్రామాలకు చెందిన గిరిజనులకు రేడియోలతోపాటు వ్యవసాయ పరికరాలు అందజేశారు. సీలేరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు ఒక కంప్యూటర్‌ను సీఆర్‌పీఎఫ్‌ అధికారులు వితరణ చేశారు. సీఆర్‌పీఎఫ్‌ సహాయ కమాండెంట్‌ సురేష్‌, ఎంపీటీసీ సభ్యుడు  పి.సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు. సీఆర్‌పీఎఫ్‌ ఆధ్వర్యాన బూసుకొండలో నిర్వహించిన వైద్య శిబిరం విజయవంతమైంది. సీఆర్‌పీఎఫ్‌ వైద్యాధికారి నితిల్‌ కుమార్‌, సీలేరు పీహెచ్‌సీ వైద్యాధికారి సౌమ్య సుమారు 250 మంది రోగులకు వైద్యసేవలు అందించి ఉచితంగా మందులు అందజేశారు. భోజన సదుపాయం కల్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని