logo

నిత్యావసరాల పంపిణీలో అవకతవకలు సహించం

ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరకుల పంపిణీలో అవకతవకలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారి ఆర్‌.శివప్రసాద్‌ హెచ్చరించారు.

Published : 29 Mar 2023 02:22 IST

జిల్లా పౌరసరఫరాల అధికారి శివప్రసాద్‌

జీఎంవలసలో గిరిజనులతో మాట్లాడుతున్న జిల్లా పౌరసరఫరాల అధికారి శివప్రసాద్‌

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరకుల పంపిణీలో అవకతవకలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారి ఆర్‌.శివప్రసాద్‌ హెచ్చరించారు. మారేడుమిల్లి మండలం గుజ్జుమామిడివలసలో మంగళవారం ఆయన పర్యటించారు. దీనిలో భాగంగా గ్రామంలోని డీఆర్‌ డిపో, అంగన్‌వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు. సరకుల నిల్వలు సక్రమంగా ఉన్నదీ.. లేనిదీ పరిశీలించారు. రేషన్‌ సరకులు సకాలంలో, సక్రమంగా అందుతున్నాయా అని స్థానిక గిరిజనులతోపాటు సర్పంచి కారం లక్ష్మిని అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా, సిబ్బంది అవకతవకలకు పాల్పడినా తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి, అంగన్‌వాడీ కేంద్రాలకు సరకులు ఎప్పటికప్పుడు చేరేలా జాగ్రత్తలు తీసుకోవాలని, పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. మన్యంలోని లోతట్టు గిరిజన గ్రామాలకు సైతం నిత్యావసర సరకులు సక్రమంగా, సకాలంలో పంపిణీ చేయాలని ఆదేశించారు. పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ జి.గణేశ్‌కుమార్‌, సహాయ అధికారి శ్రీహరి, గిరిజన సహకార సంస్థ మారేడుమిల్లి మేనేజరు ఎం.ఎన్‌.రాజారెడ్డి, సేల్స్‌ ఉమెన్‌ సుబ్బలక్ష్మి తదితరులు   పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని