logo

పేదల సంక్షేమానికి తెదేపా పథకాలు

తెదేపా ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రం పాడేరులో ఎన్టీఆర్‌ విగ్రహానికి పార్టీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు.

Published : 30 Mar 2023 03:10 IST

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: తెదేపా ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రం పాడేరులో ఎన్టీఆర్‌ విగ్రహానికి పార్టీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి బి. నాగరాజు, జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్‌ కాంతమ్మ మాట్లాడుతూ పేదవారి కోసం కేజీ బియ్యం రూ.2కు అందించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందన్నారు. పేదల అభ్యున్నతికి తెదేపా ఎన్నో పథకాలు ప్రవేశ  పెట్టిందన్నారు. విజయరాణి, సుబ్బారావు, అరకు పార్లమెంట్‌ అధికార ప్రతినిధి శివకుమార్‌, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సురేష్‌కుమార్‌, జగదీష్‌, జ్యోతికిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

రంపచోడవరం, న్యూస్‌టుడే: తెదేపా పాలనలోనే మన్యం అభివృద్ధి చెందిందని మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అన్నారు. స్థానిక ఎన్టీఆర్‌ విగ్రహానికి పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు గొర్లె సునీత, మండల పార్టీ అధ్యక్షుడు కారం సురేష్‌ తదితరులతో కలిసి రాజేశ్వరి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కేకు కోసి నాయకులు, కార్యకర్తలకు పంచారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఎన్టీఆర్‌ పార్టీని స్థాపించి అధికారం చేపట్టాక గిరిజన ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. గిరిజనులు జీడిమామిడి తోటల పెంపకానికి శ్రీకారం చుట్టి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటునందించారని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో సీఎం జగన్‌ విధ్వంసకర పాలన సాగిస్తున్నారని, ఈ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమికొట్టే సమయం ఆసన్నమైందని చెప్పారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పెంటపాటి అనంతమోహన్‌, సర్పంచి వంతల అచ్చియమ్మ, నాయకులు కారం శేషాయమ్మ, పండా చెల్లన్నదొర, దార వెంకన్న, దిడ్డి జనార్ధన్‌, కుంజం బాపన్నదొర, సిద్దా వెంకన్న, ప్రసాద్‌, వీరబాబు, చక్రపాణి, చక్రవర్తి, అన్నవరం, పెదకాపు, నీలాపు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని