logo

ప్రజాభిప్రాయ సేకరణపై ప్రచారం

సీలేరులో పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టు నిర్మాణంపై ఏప్రిల్‌ 1న జరగబోయే ప్రజాభిప్రాయ సేకరణపై బుధవారం జెన్‌కో అధికారులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.

Published : 30 Mar 2023 03:10 IST

గిరిజనులతో మాట్లాడుతున్న ఈఈ ప్రభాకర్‌, సిబ్బంది

సీలేరు, న్యూస్‌టుడే: సీలేరులో పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టు నిర్మాణంపై ఏప్రిల్‌ 1న జరగబోయే ప్రజాభిప్రాయ సేకరణపై బుధవారం జెన్‌కో అధికారులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఏపీ జెన్‌కో ఈఈ ప్రభాకర్‌ ఆధ్వర్యంలో సిబ్బంది కాలుష్య నియంత్రణ మండలి సూచించిన దుప్పిలవాడ, ధారకొండ పంచాయతీల పరిధిలో సుమారు 22 గ్రామాల్లోప్రచారం చేపట్టారు. ఏఈఈ సీహెచ్‌ సురేష్‌ పాల్గొన్నారు.

సీలేరు, న్యూస్‌టుడే: తమ డిమాండ్లు నెరవేరిస్తేనే సీలేరులో పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టు నిర్మాణానికి సహకరిస్తామని దుప్పిలవాడ పంచాయతీలో పలు గ్రామాలకు చెందిన గిరిజనులు పేర్కొన్నారు. బుధవారం బూసుకొండలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టు ప్రభావిత 20 గ్రామాలను ఒక యూనిట్‌గా తీసుకుని వారికి మొదట ప్రాధాన్యతలో ఉద్యోగావకాశాలు కల్పించాలని కోరారు. నిర్వాసిత గ్రామాల్లో ఇంటికొక ఉద్యోగం ఇవ్వాలని, గిరిజన చట్టాలను పటిష్ఠంగా అమలు చేయాలన్నారు. జేఏసీ నాయకులు కోడా ఆనంద్‌, గంగాధర్‌, కోటిబాబు, గోపాల్‌, మంగరాజు, మోహన్‌బాబు, వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని