logo

డీఈ, నలుగురు ఎంపీడీఓలకి షోకాజ్‌

వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పాడేరు ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ పేర్కొన్నారు. తాగునీటి పథకాలు పనిచేయకపోతే వెంటనే మరమ్మతులు చేయాలని ఎంపీడీఓలను ఆదేశించారు.

Published : 30 Mar 2023 03:10 IST

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ఐటీడీఏ పీఓ  

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పాడేరు ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ పేర్కొన్నారు. తాగునీటి పథకాలు పనిచేయకపోతే వెంటనే మరమ్మతులు చేయాలని ఎంపీడీఓలను ఆదేశించారు. బుధవారం ఐటీడీఏ కార్యాలయం నుంచి 11 మండలాల ఇంజినీరింగ్‌, ఉపాధిహామీ, గృహ నిర్మాణశాఖ, పంచాయతీరాజ్‌, గిరిజన సంక్షేశాఖ ఇంజినీరింగ్‌, గ్రామీణ తాగునీటి సరఫరాల విభాగం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పీవో మాట్లాడుతూ మన బడి నాడు-నేడు పనులకు ప్రభుత్వం విడుదల చేసిన రివాల్వింగ్‌ ఫండ్‌ను త్వరగా ఖర్చు చేసి పనులు వేగంగా చేయాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలకు రూ.4 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని, మరో రూ.5 కోట్లు త్వరలో విడుదల అవుతాయని చెప్పారు. ముందస్తు అనుమతి తీసుకోకుండా ప్రధాన కేంద్రం విడిచి వెళ్లారని, వీడియో కాన్ఫరెన్స్‌కి హాజరు కాలేదని  పాడేరు, ముంచంగిపుట్టు, అరకులోయ, జి.మాడుగుల ఎంపీడీఓలకు పీవో షోకాజ్‌ నోటీస్‌ జారీ చేశారు. చింతపల్లి- సీలేరు రోడ్డు పనుల్లో జాప్యంపై చింతపల్లి రహదారుల భవనాల శాఖ డీఈకి షోకాజ్‌ ఇచ్చారు. ఈఈలు డీవీఆర్‌ఎం రాజు, కె.వేణుగోపాల్‌, లీలాకృష్ణ, కొండయ్యపడాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు