logo

పొదుపు పథకాలపై అవగాహన కల్పించాలి

అనకాపల్లి డివిజన్‌ తపాలా శాఖ సూపరింటెండెంట్‌ ప్రసాద్‌బాబు బుధవారం ముంచంగిపుట్టు మండలంలో పర్యటించారు. ఆంధ్రా - ఒడిశా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలోని బుంగాపుట్టు బ్రాంచి పోస్టాఫీసును సందర్శించారు.

Published : 30 Mar 2023 03:10 IST

రికార్డులు పరిశీలిస్తున్న సూపరింటెండెంట్‌

ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే: అనకాపల్లి డివిజన్‌ తపాలా శాఖ సూపరింటెండెంట్‌ ప్రసాద్‌బాబు బుధవారం ముంచంగిపుట్టు మండలంలో పర్యటించారు. ఆంధ్రా - ఒడిశా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలోని బుంగాపుట్టు బ్రాంచి పోస్టాఫీసును సందర్శించారు. తపాలాశాఖ ద్వారా అమలు చేస్తున్న పొదుపు పథకాలపై అందరికీ అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. పొదుపు ద్వారా ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని స్థానికులకు సూచించారు. గ్రామీణ తపాలా బీమా ప్రతి ఒక్కరికి అవసరమని, తక్కువ ప్రీమీయంతో ఎక్కువ బోనస్‌ పొందవచ్చని అన్నారు. పాడేరు సబ్‌డివిజన్‌ ఐపీ మురళి, పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల తపాలా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు