logo

తెదేపాతోనే అన్నివర్గాలకు న్యాయం

తెదేపా పాలనలోనే అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. బుధవారం తెదేపా ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ శ్రేణులు జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు.

Published : 30 Mar 2023 03:10 IST

చింతపల్లిలో ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న తెదేపా నాయకులు

గూడెంకొత్తవీధి, జి.మాడుగుల, కొయ్యూరు, సీలేరు, చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: తెదేపా పాలనలోనే అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. బుధవారం తెదేపా ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ శ్రేణులు జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జీకేవీధిలో పార్టీ మండల అధ్యక్షుడు ముక్కలి రమేష్‌ తెదేపా జెండా ఆవిష్కరించారు. జి.మాడుగుల మండల కేంద్రంలో సీనియర్‌ నాయకులను సత్కరించారు. రాజేంద్రపాలెంలో తెదేపా మండల అధ్యక్షుడు జి.సత్యనారాయణ పార్టీ జెండా ఆవిష్కరించారు. సీలేరులో జరిగిన కార్యక్రమంలో పట్టణ తెదేపా అధ్యక్షుడు కె.సన్యాసిరావు, నక్కా తిరుమలరావు పాల్గొన్నారు. చింతపల్లిలో ఎన్టీఆర్‌ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. చల్లంగి జ్ఞానేశ్వరి, పూర్ణచంద్రరావు, లక్ష్మణరావు పాల్గొన్నారు.

రాజవొమ్మంగిలో..

మారేడుమిల్లి, రాజవొమ్మంగి, దేవీపట్నం, అడ్డతీగల: మారేడుమిల్లిలో మండల పార్టీ అధ్యక్షుడు గురుకు శేషుకుమార్‌, మాజీ ఎంపీపీ పల్లాల లక్ష్మీభూపతిరెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. రాజవొమ్మంగిలో తెదేపా మండలాధ్యక్షుడు గొల్లపూడి పెద్దిరాజు, ఇందుకూరుపేటలో పార్టీ మండలాధ్యక్షుడు మరిశెట్ల వెంకటేశ్వరరావు, అడ్డతీగలలో పార్టీ మండల అధ్యక్షుడు జర్తా వెంకటరమణారెడ్డి ఆధ్వర్వంలో కార్యక్రమం జరిగింది.

వరరామచంద్రాపురం, మోతుగూడెం, కూనవరం, ఎటపాక, చింతూరు: బడుగుబలహీన వర్గాల అభ్యున్నతి తెదేపాతోనే సాధ్యమని జడ్పీటీసీ సభ్యుడు వాళ్ల రంగారెడ్డి, ఆ పార్టీ వీఆర్‌పురం మండల అధ్యక్ష, కార్యదర్శులు ఆచంట శ్రీను, కన్నారావు పేర్కొన్నారు. రేఖపల్లి కూడలిలో ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళి అర్పించారు. డొంకరాయిలో ఎంపీటీసీ సభ్యుడు కరకా వెంకటరమణ, నెల్లిపాకలో తెదేపా మండల అధ్యక్షుడు పుట్టి రమేష్‌, కూనవరంలో పొడియం అప్పారావు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. చింతూరు ఆసుపత్రిలో రోగులకు నాయకులు పాలు, రొట్టె అందజేశారు.

అరకులోయలో..

అరకులోయ, డుంబ్రిగుడ, అనంతగిరి గ్రామీణం, హుకుంపేట, ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే: అరకులోయలో పార్టీ మండల అధ్యక్షుడు శెట్టి బాబూరావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. డుంబ్రిగుడలో మండల పార్టీ అధ్యక్షుడు తుడుము సుబ్బారావు జెండా ఆవిష్కరించారు. అనంతగిరిలో మండల తెదేపా కమిటీ అధ్వర్యంలో పార్టీ జెండా ఎగురవేసి మిఠాయిలు పంచారు. హుకుంపేట, ముంచంగిపుట్టులో తెదేపా నాయకులు సూర్యకాంతం, వెంకటరమణరాజు, బలరామ్‌, గడ్డంగి రామ్మూర్తి తదితరులు పార్టీ జెండా ఎగురవేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని