logo

అటవీ ఆక్రమణలపై నోటీసులు

రిజర్వు ఫారెస్టును ఆక్రమించుకొని గృహాలను ఏర్పాటు చేసుకొన్నారని, దీన్ని అటవీ చట్టం ప్రకారం తీవ్ర నేరంగా పరిగణిస్తామని రంపచోడవరం డీఎఫ్‌వో నరేందిరియన్‌ స్థానిక వాటర్‌ట్యాంకు.

Published : 31 Mar 2023 03:09 IST

ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన స్థానికులు

అటవీశాఖ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ అనంత బాబు

రంపచోడవరం, న్యూస్‌టుడే: రిజర్వు ఫారెస్టును ఆక్రమించుకొని గృహాలను ఏర్పాటు చేసుకొన్నారని, దీన్ని అటవీ చట్టం ప్రకారం తీవ్ర నేరంగా పరిగణిస్తామని రంపచోడవరం డీఎఫ్‌వో నరేందిరియన్‌ స్థానిక వాటర్‌ట్యాంకు, దర్గా, వాల్మీకిపేట వీధుల్లో కొంతమందికి నోటీసులు జారీ చేశారు. 15 రోజుల్లో సరైన ఆధారాలతో తమకు వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. దీంతో స్థానికులు గురువారం ఎల్లవరంలో ఎమ్మెల్సీ అనంత బాబు, ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మిని కలిసి తమ గోడును విన్నవించారు. తామంతా తాతముత్తాతల నుంచి ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నామని, అటవీ అధికారులకు తమకు నోటీసులు ఇవ్వడంపై ఆందోళన చెందుతున్నామని తెలిపారు. దీనికి స్పందించిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు అటవీశాఖ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. తాము అండగా ఉంటామని, ఎవరూ భయపడవద్దని ప్రజలకు హామీ ఇచ్చారు. రంపచోడవరం సర్పంచి మంగా బొజ్జయ్య, వైకాపా మండల కన్వీనర్‌ జల్లేపల్లి రామన్నదొర, మాజీ సర్పంచి పండా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని