logo

కారును ఢీకొన్న దురంతో.. పలు రైళ్ల ఆలస్యం

భీమడోలు సమీపంలోని లెవిల్‌ క్రాసింగ్‌ వద్ద రైలు పట్టాలపైకి వచ్చి నిలిచిపోయిన కారును సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్తున్న దురంతో సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ గురువారం ఢీ కొట్టింది.

Published : 31 Mar 2023 03:09 IST

విశాఖపట్నం, న్యూస్‌టుడే: భీమడోలు సమీపంలోని లెవిల్‌ క్రాసింగ్‌ వద్ద రైలు పట్టాలపైకి వచ్చి నిలిచిపోయిన కారును సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్తున్న దురంతో సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ గురువారం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏ విధమైన ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ బొలెరో వాహనం నుజ్జయింది. దీంతో      ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.  విజయవాడ నుంచి విశాఖ వైపు వచ్చే పలు రైళ్లు దాదాపు 3 గంటలకు పైగా ఆలస్యంగా నడిచాయి. రైళ్లు గంటల తరబడి నిలిచిపోవడంతో గురువారం రాత్రి 9 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి వెళ్లాల్సిన విశాఖ- కోర్బా ఎక్స్‌ప్రెస్‌ అర్ధరాత్రి దాటిన తరువాత 1.25 గంటలకు బయలుదేరి వెళ్లేలా మార్పు చేశారు. గురువారం విశాఖ చేరుకోవాల్సిన అల్పూజా-దన్‌బాద్‌ బొకారో, బెంగళూరు-భువనేశ్వర్‌ ప్రశాంతి, విజయవాడ- విశాఖ రత్నాచల్‌, కడప-విశాఖ తిరుమల  ఎక్స్‌ప్రెస్‌ రైళ్లతో పాటు మరికొన్ని వారాంతపు రైళ్లు సైతం ఆలస్యంగా నడిచాయి.

సికింద్రాబాద్‌-అగర్తలా ప్రత్యేక రైలు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్‌-అగర్తలాకు(ఒక వైపు మాత్రమే) ప్రత్యేక రైలును నడపనున్నట్లు వాల్తేర్‌ సీనియర్‌ డీసీఎం ఏ.కె. త్రిపాఠి తెలిపారు. సికింద్రాబాద్‌-అగర్తలా(07018) ప్రత్యేక రైలు ఏప్రిల్‌ 2న ఉదయం 11 గంటలకు  సికింద్రాబాద్‌లో బయలుదేరి మంగళవారం రాత్రి 11.15 గంటలకు అగర్తలా చేరుకోనున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు గమనించి   ఈ రైలు సేవల్ని వినియోగించుకోవాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని