logo

కోనాంలో ‘మన్యం ధీరుడు.. సీతారామరాజు’

అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర ఆధారంగా ప్రజలకు మంచి సందేశం ఇవ్వాలని సంకల్పంతో ‘మన్యం ధీరుడు.. సీతారామరాజు’ చిత్రీకరణకు శ్రీకారం చుట్టామని నిర్మాత, నటుడు ఆర్‌.వి.వి.సత్యనారాయణ అన్నారు.

Updated : 01 Apr 2023 06:39 IST

దర్శకుడు నరేశ్‌కు కథను అందిస్తున్న నిర్మాత సత్యనారాయణ

చీడికాడ, న్యూస్‌టుడే:  అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్ర ఆధారంగా ప్రజలకు మంచి సందేశం ఇవ్వాలని సంకల్పంతో ‘మన్యం ధీరుడు.. సీతారామరాజు’ చిత్రీకరణకు శ్రీకారం చుట్టామని నిర్మాత, నటుడు ఆర్‌.వి.వి.సత్యనారాయణ అన్నారు. కోనాంలోని బోగుండమ్మ ఆలయంలో శుక్రవారం పూజలు నిర్వహించారు. దర్శకుడు నరేశ్‌ టెక్కల, వైకాపా రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు యర్రా అప్పారావు, వైస్‌ ఎంపీపీ కిమిడి చిన్నమ్మలుతో కలిసి చిత్రీకరణ ప్రారంభించారు. నిర్మాత మాట్లాడుతూ..  సీతారామరాజుగా తాను, గిన్నిస్‌ బుక్‌ గ్రహీత కోరుకొండ రంగారావు, జబర్దస్త్‌ నటులు రాపేటి అప్పారావు, సత్తిపండు, ఉమ్మడి విశాఖ జిల్లాలకు చెందిన పలువురు నటులు ఈ సినిమాలో నటిస్తున్నారన్నారు. ప్రారంభ కార్యక్రమంలో వర్ధమాన నటుడు గోపి, నాయకులు చలుగు సత్యనారాయణ, సుంకర శ్రీనివాసరావు, మట్టా అప్పారావు, కిమిడి సన్యాసిరావు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు