అంతర్జాతీయ విపణిలో అరకు కాఫీ
కమ్మని కాఫీ పేరు చెబితేనే అరకు కాఫీ గుర్తొస్తుంది. ఇప్పుడు అదే కాఫీకి మరో అరుదైన ఘనత దక్కింది. జీసీసీ అరకువేలి కాఫీకి సేంద్రియ సాగు ధ్రువపత్రం (ఆర్గానిక్ సర్టిఫికేషన్) లభించింది.
ఈనాడు డిజిటల్ పాడేరు, చింతపల్లి, న్యూస్‌టుడే
కమ్మని కాఫీ పేరు చెబితేనే అరకు కాఫీ గుర్తొస్తుంది. ఇప్పుడు అదే కాఫీకి మరో అరుదైన ఘనత దక్కింది. జీసీసీ అరకువేలి కాఫీకి సేంద్రియ సాగు ధ్రువపత్రం (ఆర్గానిక్ సర్టిఫికేషన్) లభించింది. చింతపల్లి మండలంలో 2184.76 ఎకరాల్లో కాఫీని సేంద్రియ పద్ధతుల్లో పండిస్తున్న సుమారు 1300 మంది గిరిరైతులకు ఇది వర్తిస్తుంది.
క్షేత్రస్థాయిలో గిరిజన సహకారసంస్థ (జీసీసీ) తీసుకున్న చొరవ కారణంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన వ్యవసాయ, ఆహారోత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఏపీఈడీఏ) తాజాగా సేంద్రియ సాగు ధ్రువపత్రం జారీ చేసింది. దీనివల్ల గిరిజన రైతులు పండించిన కాఫీకి అంతర్జాతీయ విపణిలో మంచి ధరలు దక్కనున్నాయి.
గొందిపాకల్లో ఆర్గానిక్ పద్ధతిలో గిరిరైతులు పండిస్తున్న కాఫీతోటలు
ఫలించిన నాలుగేళ్ల నిరీక్షణ
గిరిజనుల సహకారంతో జీసీసీ మరో మైలురాయి అధిగమించింది. మన్యంలో గిరిజనులు పండించే పంటలకు సాధారణంగా రసాయనిక ఎరువులు, పురుగు మందులను వినియోగించరు. దీనివల్ల దిగుబడులు కొంతతగ్గినా నాణ్యత ఉంటుంది. అదే ఇప్పుడు గిరిజనులకు వరంగా మారింది. రసాయనిక ఎరువులు, పురుగు మందుల వినియోగం మానవాళి ఆరోగ్యంపై దుప్ప్రభావాలు చూపుతున్నాయి. పర్యావరణానికి హాని జరుగుతోంది. విదేశాల్లోనూ సేంద్రియ ఎరువుల వినియోగంతో పండించే పంటలకు గిరాకీ ఉంటోంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో సేంద్రియ సాగు పంటలకు క్రమేపీ ఆదరణ పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని గిరిజన సహకార సంస్థ గిరి రైతులను ప్రోత్సహిస్తూ వచ్చింది.
గొందిపాకలు రైతులు ముందంజ
సేంద్రియ పంటల సాగులో చింతపల్లి మండలంలోని గొందిపాకలు గ్రామానికి చెందిన రైతులు ముందు వరుసలో ఉన్నారు. గ్రామంలో కొందరు అభ్యుదయ రైతులంతా కలసి గిరిజన గ్రామ స్వరాజ్య సంఘంగా ఏర్పడ్డారు. వీరంతా సంఘటితంగా సేంద్రియ సాగుకు శ్రీకారం చుట్టారు. తొలి విడతగా వీరు కాఫీ సాగును ఎంచుకున్నారు. ఎరువులు వేయకుండా సేంద్రియ పద్ధతుల్లోనే కాఫీని, అంతర పంటగా మిరియాలను పండిస్తూ వస్తున్నారు. దీన్ని గుర్తించిన గిరిజన సహకార సంస్థ నాలుగేళ్ల కిందటే వారిని మరింత ప్రోత్సహించింది. చింతపల్లి మండలం గొందిపాకలుతోపాటు లంబసింగి, కప్పలు గ్రామాల్లో రైతులతోనూ సమావేశాలు ఏర్పాటు చేసి రైతులను సంఘటితం చేసింది.
కాఫీ తోటల్లో అంతరపంటలుగా సాగవుతున్న మిరియాలు
గూడెంకొత్తవీధి రైతులకు త్వరలో..
చింతపల్లి తరహాలోనే గూడెంకొత్తవీధి మండలంలో మూడు గ్రామాలకు చెందిన 1300 మంది గిరిజన రైతులకు త్వరలో జీసీసీ ద్వారా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (ఏపీఈడీఏ) ద్వారా సేంద్రియ సాగు ధ్రువపత్రం జారీ కానుంది. గూడెంకొత్తవీధి, పెదవలస, ఎర్రచెరువులు గ్రామాల్లో 3393.78 ఎకరాల్లో 1300 మంది రైతులను గుర్తించారు. వీరికి త్వరలో ఈ సేంద్రియ సాగు ధ్రువపత్రాలు జారీ కానున్నాయి.
రైతులకు రెట్టింపు లాభాలు..
- సురేష్‌కుమార్, జీసీసీ ఎండీ
గిరిజన రైతులు మొదటి నుంచి సేంద్రియ పంటలను పండిస్తున్నా వాటిని ఒక క్రమపద్ధతిలో ప్రణాళికాబద్ధంగా సాగు చేసేలా గిరిజన సహకార సంస్థ క్షేత్రస్థాయిలో గిరి రైతులను ప్రోత్సహిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే తొలివిడతగా చింతపల్లి మండలం గొందిపాకలు, లంబసింగి, కప్పల గ్రామాల్లో రైతులను ఎంపిక చేశాం. సుమారు 1,300 మంది రైతులు 2,184 ఎకరాల్లో కాఫీతో పాటు అంతరపంటగా మిరియాలను సాగు చేస్తున్నారు. వీరందరికీ సేంద్రియ సాగు ధ్రువపత్రాలు జారీ చేసే విషయంలో జీసీసీ చొరవ తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఏపీఈడీఏ సూచించిన మార్గదర్శకాలను రైతులంతా పక్కాగా ఆచరించేలా చర్యలు చేపట్టాం. ఈ ధ్రువపత్రం వల్ల రైతులు వారు పండించిన కాఫీ, మిరియాలను నేరుగా విదేశీ సంస్థలకు అంతర్జాతీయ విపణిలో విక్రయించుకునేందుకు అవకాశం ఉంటుంది. దళారుల ప్రమేయం ఉండదు. రైతులు పండించిన ఉత్పత్తులకు రెట్టింపు ధరలు లభిస్తాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
1945 నుంచి.. ఆ చర్చిలో 927 మందిపై లైంగిక వేధింపులు!
-
World News
Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట.. ముందస్తు బెయిల్ గడువు పొడిగింపు
-
World News
జపాన్‌లో జన సంక్షోభం.. రికార్డు స్థాయిలో పడిపోయిన జననాలు!
-
Crime News
Train accident: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం.. ఏపీలో హెల్ప్‌లైన్ నంబర్లు
-
Movies News
Vishwak Sen: అందుకే పేరు మార్చుకున్నా: విశ్వక్ సేన్
-
India News
Train Accident: రైలు ప్రమాదంపై రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖుల దిగ్భ్రాంతి