logo

సమాచారం లేకుండా దుకాణాలు కూల్చేస్తారా?

ప్రజా వేదిక తరహాలో పాడేరులో దుకాణాలు కూల్చివేశారంటూ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి  ధ్వజమెత్తారు. శనివారం ఉదయం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ కూడలిలో కూల్చేసిన దుకాణాలను ఆమె పరిశీలించారు.

Published : 28 May 2023 01:54 IST

మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి

బాధితులతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: ప్రజా వేదిక తరహాలో పాడేరులో దుకాణాలు కూల్చివేశారంటూ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి  ధ్వజమెత్తారు. శనివారం ఉదయం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ కూడలిలో కూల్చేసిన దుకాణాలను ఆమె పరిశీలించారు. బాధితులతో మాట్లాడారు. రోడ్డు విస్తరణ అంటూ ఎలాంటి ముందస్తు సమాచారం, నోటీసులు లేకుండా పాడేరులో దుకాణాలు కూల్చేస్తున్నారని  మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రజలకు అండగా ఉండాల్సిన బాధ్యత ఆమెకు లేదా అని ప్రశ్నించారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ఇలాంటి పరిస్థితి ఎదురైతే దుకాణదారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశామన్నారు. అధికారులు స్పందించి దుకాణాలు కోల్పోయిన గిరిజన నిరుద్యోగులను ఆదుకోవాలని, లేనిపక్షంలో బాధితులతో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వెంకటసురేష్‌కుమార్‌, రొబ్బి రాము తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని