logo

నేటి నుంచి మోదకొండమ్మ ఉత్సవాలు

పెదబయలులో మోదకొండమ్మ ఉత్సవాలు ఆదివారం నుంచి మూడురోజులపాటు జరగనున్నాయి. తొలిరోజు ఉదయం ప్రత్యేక పూజాకార్యక్రమాలతో అమ్మవారి ఆలయం నుంచి శతకంపట్టు వరకు అమ్మవారి పాదాలు, ఘటాలను ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు.

Published : 28 May 2023 01:54 IST

వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు

మోదకొండమ్మ

పెదబయలు, న్యూస్‌టుడే: పెదబయలులో మోదకొండమ్మ ఉత్సవాలు ఆదివారం నుంచి మూడురోజులపాటు జరగనున్నాయి. తొలిరోజు ఉదయం ప్రత్యేక పూజాకార్యక్రమాలతో అమ్మవారి ఆలయం నుంచి శతకంపట్టు వరకు అమ్మవారి పాదాలు, ఘటాలను ఊరేగింపుగా తీసుకెళ్లనున్నారు. మంగళవారం ఊరేగింపుగా గ్రామం పొలిమేర వరకు వీటిని తీసుకెళ్లి ఆలయం వద్దకు చేరుస్తారు. ఉత్సవాలకు ఆలయంతోపాటు పెదబయలు ముస్తాబవుతోంది. మూడురోజులపాటు ప్రత్యేక విద్యుత్తు అలంకరణ, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఉత్సవాల విజయవంతానికి పోలీసులు, అధికారులు, అన్నివర్గాల ప్రజలు సహకరించాలని కమిటీ సభ్యులు కోరారు.

రంపచోడవరం, న్యూస్‌టుడే: ఐ.పోలవరం కొండపై ఉన్న వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. తితిదే ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుంచి స్వామివారికి పూజలు జరిగాయి. ఏజెన్సీ ప్రాంతానికి చెందిన భక్తులతో పాటు మైదాన ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలను స్వీకరించారని ధర్మ ప్రచార సేవా భక్త బృందం సభ్యులు నల్లమిల్లి వేంకటరామారెడ్డి తెలిపారు.

వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేస్తున్న అర్చకులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని