logo

భారీ వర్షాలు.. నేలకూలిన చెట్లు

వారం రోజులుగా కాస్తున్న ఎండలకు ఇబ్బందులు పడిన ఏజెన్సీ వాసులు ఆదివారం మధ్యాహ్నం పడిన వర్షంతో ఊరట చెందారు.

Published : 29 May 2023 01:56 IST

ఐటీడీఏ సి-క్వార్టర్స్‌ వద్ద ఇంటిపై పడిన చెట్టు

రంపచోడవరం, న్యూస్‌టుడే: వారం రోజులుగా కాస్తున్న ఎండలకు ఇబ్బందులు పడిన ఏజెన్సీ వాసులు ఆదివారం మధ్యాహ్నం పడిన వర్షంతో ఊరట చెందారు. ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో స్థానిక ఐటీడీఏ సి-క్వార్టర్స్‌, సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఆవరణలో చెట్లు పడిపోయాయి. మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. సిబ్బంది చెట్టుకొమ్మలు తొలగించి సరఫరా పునరుద్ధరించారు.

చినరేలంగిపాడులో విద్యుత్తు తీగలపై పడిన తాటిచెట్టు

రాజవొమ్మంగి, న్యూస్‌టుడే: రాజవొమ్మంగిలో ఉరుములు, మెరుపుల తో వడగళ్ల వర్షం కురిసింది. చినరేలంగిపాడు, రాజవొమ్మంగిలో పలుచోట్ల తాటిచెట్లు, ఇతర చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్తు తీగలపై పడటంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మామిడి కాయలు నేలరాలాయి. లాగరాయిలో వడగళ్ల వాన కురిసింది. శరభవరం, కొండపల్లి, సూరంపాలెం, దూసరపాము, వట్టిగెడ్డ, సింగంపల్లి, తంటికొండ, బడదనాంపల్లి, చినలరేలంగిపాడు, రాజుపేట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు. సిబ్బంది సరఫరా పునరుద్ధరించే పనుల్లో నిమగ్నమయ్యారు.

అడ్డతీగల: అడ్డతీగలలో ఈదురు గాలులు, వర్షానికి పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్తు తీగలపై పడ్డాయి.   సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ట్రాన్స్‌కో సిబ్బంది మరమ్మతు పనుల్లో నిమగ్నమయ్యారు.

పిడుగు పడి ఇద్దరికి గాయాలు

సీలేరు: జీకేవీధి మండలం ద]ుప్పిలవాడ పంచాయతీ పెద్ద అగ్రహారం వద్ద ఆదివారం పిడుగుపడి ఇద్దరికి గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన కిముడు లక్ష్మి, మణి ఇంటి వద్ద ఉండగా మునగచెట్టుపై పిడుగు పడింది. వీరిద్దరూ అస్వస్థతకు గురయ్యారు. వారిని సీలేరు పీహెచ్‌సీకి తరలించారు. అక్కడే చికిత్స పొందుతున్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని