నిర్వాసితులు పోరుబాట పట్టాల్సిందే
పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి పోరుబాట పట్టాల్సిందేనని సీపీఎం మండల కార్యదర్శి సోయం చినబాబు పిలుపునిచ్చారు.
సమావేశంలో మాట్లాడుతున్న చినబాబు
వరరామచంద్రాపురం, న్యూస్‌టుడే: పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి పోరుబాట పట్టాల్సిందేనని సీపీఎం మండల కార్యదర్శి సోయం చినబాబు పిలుపునిచ్చారు. మొద్దులగూడెంలో ఆదివారం నిర్వహించిన ఆ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాకాలంలో గోదావరి ముంపు నీటి ప్రభావంతో ఈ గ్రామాలన్నీ మునిగిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం వచ్చేనెల 20 నుంచి వీఆర్‌పురం నుంచి విజయవాడ వరకు మహాపాదయాత్రకు అన్ని విధాలుగా సన్నద్దం అయ్యామని, ముంపువాసులు ఈ పాదయాత్రలో పాల్గొనాలని కోరారు. పంకు సత్తిబాబు, సోడే మల్లయ్య, కుంజా కన్నయ్య, పుల్లయ్య, శ్రీరాంమూర్తి, చంద్రరరావు తదితరులు పాల్గొన్నారు.
కూనవరం, న్యూస్‌టుడే: పోలవరం ముంపు గ్రామాల్లోని నిర్వాసితులను కాంటూరులతో సంబంధం లేకుండా ఆదుకోవాలని జాతీయ ఆదివాసీ సంరక్షణ సమితి కన్వీనర్ కారం సీతారామన్న దొర కోరారు. చినార్కూరులో ఆదివాసులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం పేరుతో రెండు జిల్లాల్లోని ఎనిమిది ముంపు మండలాల్లో ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందడంలేదన్నారు. పునరావాసాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా తాత్సారం చేయడం సరికాదన్నారు. ప్రభుత్వ కాంటూరు లెక్కలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న ముంపునకు పొంతన లేకుండా ఉందన్నారు. ముఖ్యమంత్రి గతంలో పరిహారాలు ఇచ్చిన భూములకు అదనంగా ఇస్తానన్న రూ.అయిదు లక్షలు ఇప్పటివరకు ఇవ్వకపోవడం దారుణమన్నారు. సోడే వీరభద్రం, పూసం వేణు, నాగిరెడ్డి, వీరప్రతాప్, చిన్నబ్బాయి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
MotoGP: భారత మ్యాప్‌ను తప్పుగా చూపిన మోటోజీపీ.. నెటిజన్ల మొట్టికాయలతో సారీ!
-
Ukraine Crisis: భద్రతామండలి పని తీరును ప్రపంచం ప్రశ్నించాలి!: భారత్
-
Chandrababu Arrest: చంద్రబాబుకు బాసటగా.. కొత్తగూడెంలో కదం తొక్కిన అభిమానులు
-
Swiggy: యూజర్ల నుంచి స్విగ్గీ చిల్లర కొట్టేస్తోందా? కంపెనీ వివరణ ఇదే..!
-
Salman khan: రూ.100కోట్ల వసూళ్లంటే చాలా తక్కువ: సల్మాన్ ఖాన్
-
Apply Now: ఇంటర్‌తో 7,547 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?