logo

రహదారి సౌకర్యం లేక గర్భిణి అవస్థలు

గత్తుం పంచాయతీ గాలిపాడు గ్రామానికి రహదారి సౌకర్యం లేక ఒక నిండు గర్భిణి అవస్థలు పడింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Published : 29 May 2023 01:56 IST

గత్తుం సమీపంలో అంబులెన్స్‌లో గర్భిణి ఆసుపత్రికి తరలింపు

హుకుంపేట, న్యూస్‌టుడే: గత్తుం పంచాయతీ గాలిపాడు గ్రామానికి రహదారి సౌకర్యం లేక ఒక నిండు గర్భిణి అవస్థలు పడింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గాలిపాడు గ్రామానికి చెందిన జన్ని కొండమ్మ నిండు గర్భిణి. ఆదివారం ఉదయం ఈమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. గ్రామానికి రహదారి లేకపోవడంతో అంబులెన్సు వచ్చే మార్గం లేదు. దీంతో కుటుంబసభ్యులు ఆమెను డోలీమోతతో రెండు కిలోమీటర్లు దూరం తీసుకొచ్చారు. గత్తుం గ్రామానికి సమీపంలో అంబులెన్సులో ఎక్కించి హుకుంపేట ఆసుపత్రికి తరలించారు. తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని అధికారులు, నాయకుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని ఆ గ్రామస్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి రహదారి సౌక్య్రం కల్పించాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని