logo

సుందరీకరణ పేరుతో.. చిందరవందర

ఆంధ్రాఊటీ అరకులోయని సర్వాంగ సుందరంగా మారుస్తామని రూ. 24 కోట్లు వెచ్చించిన అధికారులు చివరికి  మురుగుమయంగా మార్చేశారు.

Updated : 29 May 2023 05:15 IST

అరకులోయలోని పున్నమి అతిథిగృహం రహదారిలో చెరువులా రోడ్డు

అరకులోయ, న్యూస్‌టుడే: ఆంధ్రాఊటీ అరకులోయని సర్వాంగ సుందరంగా మారుస్తామని రూ. 24 కోట్లు వెచ్చించిన అధికారులు చివరికి  మురుగుమయంగా మార్చేశారు. పట్టణాన్ని సుందరీకరణ చేయాలనే ఉద్దేశంతో ఐటీఐ కూడలి నుంచి రహదారి విస్తరణకి, భూగర్భ డ్రైనేజీకి ప్రభుత్వం రూ. 24 కోట్లు కేటాయించింది. గుత్తేదారు ఇష్టానుసారంగా పనులను చేయటంతో అందం మాట దేవుడెరుగు... మరింత అధ్వానంగా వరద ప్రాంతంగా మార్చేశారు. రోడ్లు, భవనాల శాఖ అధికారులు సైతం సరైన పర్యవేక్షణ చేయకుండా వదిలేయటంతో పనులు నాసిరకంగా జరిగాయి. ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులు విశాఖపట్నం నుంచి రాకుండా స్థానికంగా చిరుద్యోగులకు కోట్లాది రూపాయల పనుల పర్యవేక్షణ వదిలేయటంతో ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఎండపల్లివలస గంగమ్మతల్లి ఆలయం వద్ద మోకాలి లోతున నీరు

* ప్రణాళిక లేకుండా పనులు చేయటంతో చిన్నపాటి వర్షం కురిస్తే చాలు... రహదారంతా నీరు మారిపోతుంది. ఎండపల్లివలసలోని గంగమ్మతల్లి ఆలయం వద్ద వాన పడితే ఆరోజు ఇది ఈ వన్‌వే మార్గంగా మారిపోతోంది. ఎందుకంటే మరోవైపు రహదారి మొత్తం మోకాలి లోతున నీళ్లు నిలిచిపోతున్నాయి.

* పున్నమి అతిథిగృహం ఎదురుగా ఉన్న ప్రధాన రహదారి వద్ద కూడా చెరువును తలపిస్తోంది. కోట్లు ఖర్చు చేసి ఏం సుందరీకరణ చేశారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని