logo

ఎన్టీఆర్‌ సేవలు చిరస్మరణీయం

దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ గిరిజన ప్రాంతానికి అందించిన సేవలు చిరస్మరణీయమని మాజీ మంత్రి మత్సరాస మణికుమారి అన్నారు.

Published : 29 May 2023 01:56 IST

పాడేరులో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన
మాజీ మంత్రి మణికుమారి, బొర్రా నాగరాజు, కాంతమ్మ, విజయరాణి తదితరులు

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ గిరిజన ప్రాంతానికి అందించిన సేవలు చిరస్మరణీయమని మాజీ మంత్రి మత్సరాస మణికుమారి అన్నారు. జిల్లావ్యాప్తంగా ఎన్టీఆర్‌ శత జయంత్సుత్యవాలను ఆదివారం తెదేపా నాయకులు ఘనంగా నిర్వహించారు. పాడేరు స్టేట్‌ బ్యాంకు ఎదురుగా ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి మాజీ మంత్రి మణికుమారి, సీనియర్‌ నాయకులు బొర్రా నాగరాజు, కాంతమ్మ, విజయరాణి ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏజెన్సీ ప్రాంతంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టారని గుర్తుచేశారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, వంతెనలు, ఆర్టీసీ కాంప్లెక్స్‌, పాడేరు ఆర్టీసీ డిపో, ఏపీ గురుకులం, ఆదర్శ పాలిటెక్నిక్‌ కళాశాలలు, అరకులో ఐటీఐ ఏర్పాటు చేశారని, కాఫీ, మిరియాల రైతులకు ప్రోత్సాహకాలు అందించి వారిని ప్రోత్సహించారన్నారు. నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని