logo

పాపికొండలకు ఏడు పర్యాటక బోట్లు

గోదావరి నదిపై పాపికొండల విహారయాత్రకు పర్యాటకులు పోటెత్తారు. దేవీపట్నం మండలం గండిపోశమ్మ అమ్మవారి ఆలయం నుంచి ఆదివారం ఏడు బోట్లపై 420 మంది పర్యటకులు పాపికొండల అందాలు తిలకించడానికి వెళ్లారని కంట్రోల్‌ రూమ్‌ మేనేజర్‌ రజిత్‌ తెలిపారు.

Published : 29 May 2023 01:56 IST

పోశమ్మగండి వద్ద బోట్లు

దేవీపట్నం, న్యూస్‌టుడే: గోదావరి నదిపై పాపికొండల విహారయాత్రకు పర్యాటకులు పోటెత్తారు. దేవీపట్నం మండలం గండిపోశమ్మ అమ్మవారి ఆలయం నుంచి ఆదివారం ఏడు బోట్లపై 420 మంది పర్యటకులు పాపికొండల అందాలు తిలకించడానికి వెళ్లారని కంట్రోల్‌ రూమ్‌ మేనేజర్‌ రజిత్‌ తెలిపారు. గండిపోశమ్మ అమ్మవారి ఆలయానికి చేరుకున్న వీరు తొలుత గండిపోశమ్మ అమ్మవారి దర్శనం అనంతరం విహారయాత్రకు వెళ్లారు. అధిక సంఖ్యలో పర్యటకలు పాపికొండలు వెళ్లారు.

* అమ్మవారి ఆలయం వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తుల రద్దీ కొనసాగింది. సుమారు అయిదు వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోగా ఆలయానికి రూ. 35,585  ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. ఆలయానికి వచ్చిన భక్తులు కొండలపైనా, చెట్ల కిందా వంటావార్పు కార్యక్రమాలను నిర్వహించారు.

 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని