logo

ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ప్రారంభం

జోన్‌-1 పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని డాక్టర్‌ అంబేడ్కర్‌ గురుకులాలకు చెందిన ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ప్రారంభించినట్లు జిల్లా సమన్వయకర్త ఎస్‌.రూపవతి తెలిపారు.

Published : 29 May 2023 01:56 IST

విశాఖపట్నం, న్యూస్‌టుడే : c జూనియర్‌ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్‌ ఉపాధ్యాయులు, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ ఉపాధ్యాయులు, స్పెషల్‌ ఉపాధ్యాయులు, పర్యవేక్షకులు, సీనియర్‌ అసిస్టెంట్‌లు, ఒప్పంద ఉపాధ్యాయులకు బదిలీలకు సంబంధించిన కౌన్సెలింగ్‌ ఈనెల 30, 31 తేదీల్లో మేహాద్రిగెడ్డ గురుకులంలో జరుగుతుందన్నారు.

నిబంధనలు పాటించాలంటూ నిరసన

ఉమ్మడి విశాఖ జిల్లాల్లో జరుగుతున్న ఉపాధ్యాయ బదిలీల్లో గత సంప్రదాయలను పాటించాలని, మాన్యువల్‌గా నిర్వహించాలంటూ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా విద్యాశాఖాధి కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. కార్యక్రమం చేపట్టారు. ప్రధానోపాధ్యాయ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ఎం.వి.కృష్ణకుమార్‌ మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా బదిలీల కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నారు. దీనివల్ల ఎస్‌జీటీ పోస్టులు పోతున్నాయన్నారు. దీంతో పాఠశాలలు మూతపడే అవకాశం ఉందన్నారు. 2015 బదిలీ ఉపాధ్యాయులకు న్యాయం జరగాలని డిమాండ్‌ చేశారు. నిబంధనలు పాటించకపోతే సోమవారం నుంచి ఆందోళన ఉద్ధృతం చేస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని